ఈ హీరోయిన్స్ మతం మార్చుకోవడం వెనక ఎంత పెద్ద కథ ఉందో తెలుసా..?

ఏ ఫీల్డ్ లో ఉన్న వాళ్ల కులానికి వాళ్ల మతానికి చెందిన వాళ్ళకి ఎక్కువ ప్రియారిటి ఇస్తుంటారు.

ఎందుకంటే వీడు మనవాడు అనుకుంటేనే జనాలు వారిని ఆదరించే పరిస్థితిలో మనం ఉన్నాం.

ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అయితే వీడు మా కులం వాడు అందుకే నేను వాన్ని ఆదరిస్తాను అని చాలామంది అనుకుంటారు.అలాగే వీడు మా మతం వాడు అందుకే వాడి సినిమాలు నేను చూస్తున్నాను అని చాలామంది అనుకుంటారు కానీ సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా హీరోయిన్ గా వెలుగొందిన చాలామంది వాళ్లు కులానికి మతానికి అతితులం అని నిరూపిస్తూ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ లు చేసుకున్నారు.

వాళ్లలో ముఖ్యంగా చెప్పుకునే వాళ్ళు ఎవరో చూద్దాం.

ఇంద్రజ :

తెలుగు సినిమాల్లో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఇంద్రజ మాత్రమే.అప్పట్లో కృష్ణ లాంటి సీనియర్ హీరోలతో కూడా నటించారు.ఎస్ వి కృష్ణారెడ్డి అలీనీ హీరోగా పెట్టి మదర్ సెంటిమెంట్ తో తీసిన సినిమా యమలీల లో ఇంద్రజ హీరోయిన్ గా చేశారు.

Advertisement

ఆ సినిమా లో చేసినందుకు ఆమెకు మంచి పేరు వచ్చింది.ఆ తర్వాత ఆమె తెలుగు తమిళ్ లాంగ్వేజ్ లో చాలా సినిమాలు చేసింది.హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోవడంతో కులమతాలకు అతీతంగా అఫ్సర్ అనే ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు వాళ్ళ భర్త, అమ్మానాన్నల, అత్తమామల సపోర్ట్ వల్లే తను తిరిగి మళ్ళీ సినిమాల్లో నటిస్తున్నాను అని చెప్పుకొచ్చారు.

ఇంద్రజ రీఎంట్రీ లో శతమానం భవతి లాంటి సినిమాల్లో నటించి అందరి మన్ననలు పొందారు.

ఏఆర్ రహమాన్ :

ఏ ఆర్ రెహమాన్ హిందువుగా పుట్టి తర్వాత ముస్లిం గా కన్వర్ట్ అయ్యారు.ఆయన అసలు పేరు దిలీప్ కుమార్ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో కీబోర్డ్ ప్లేయర్ గా ఇళయరాజా గారి దగ్గర వర్క్ చేసేవాడు ఆ తర్వాత రాజ్ కోటి గారి దగ్గర కూడా కొన్ని రోజులు ఆ తర్వాత తను మ్యూజిక్ డైరెక్టర్ గా మారి చాలా సినిమాలకు తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు.మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా, సఖి లాంటి సినిమాలకి తన మ్యూజిక్ ఎంత ప్లస్ అయ్యిందో మనందరికీ తెలుసు.

అలాగే శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఒకే ఒక్కడు, జీన్స్, రోబో లాంటి సినిమాల్లో కూడా తన మ్యూజిక్ తో సత్తా చూపించాడు.అయితే ఏ ఆర్ రెహమాన్ కడపలోని పెద్ద దర్గాని, కుసుమారు దర్గాని, నెల్లూరు వేనాడు దర్గానీ తరచూ దర్శించుకుంటారు.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలో ఆయన స్వరపరిచిన జయహో సాంగ్ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చింది, రెండు ఆస్కార్ అవార్డులు కూడా వచ్చాయి.

ఆమని :

Advertisement

ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన జంబలకడిపంబ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి మార్కులు పొందింది ఆ సినిమా హిట్ కావడంతో తనకు వరుసగా ఆఫర్లు రావడం స్టార్ట్ అయ్యాయి.రాజేంద్ర ప్రసాద్, కృష్ణ లాంటి హీరోలతో సినిమాలు చేసింది అయితే బాపు గారు డైరెక్షన్ లో వచ్చిన మిస్టర్ పెళ్ళాం సినిమాతో తనకు మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపు వచ్చింది.

మిస్టర్ పెళ్ళాం సినిమా కి ఉత్తమ ఫిలింగా నేషనల్ అవార్డ్ వచ్చింది.ఆమనికి బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డు వచ్చింది .అయితే ఆమని సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు వచ్చినన్ని రోజులు యాక్టింగ్ చేశారు ఆ తర్వాత తమిళ ప్రొడ్యూసర్ కాజా గారిని పెళ్లి చేసుకున్నారు ఆమని హిందువు, కాజా ముస్లిం అయినప్పటికీ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు అయితే కాజా చేసిన సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో చాలా డబ్బుల్ని పోగొట్టుకున్నారు దాంతో ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఎదుర్కొన్న ఆమని తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి తెలుగు సినిమాల్లో కూడా నటిస్తున్నారు.ప్రస్తుతం ఆమె హీరోలకి హీరోయిన్లకి తల్లి పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు సాధిస్తున్నారు.

తెలుగు సినిమా పరిశ్రమలో నటించే నటులు నటీమణులు ఒక కులంలో మతంలో పుట్టి వేరే కులం మతం వ్యక్తులను పెళ్లి చేసుకున్నారు.

తాజా వార్తలు