విడాకుల కారణంగా కెరియర్ కోల్పోతున్న టాలీవుడ్ హీరోయిన్స్ !

సినిమాల్లో నటించే వారి జీవితం ఎప్పుడూ అద్దాలమేడలో నివసించినట్టుగానే ఉంటుంది.ఎవరు రాయి విసిరినా సరే అద్దం పగలక మానదు.

 Tollywood Heroines Career Collapsed After Divorce Tollywood, Samantha , Divorce, Sarika , Kamal Hassan, Renu Desai, Naga Chaitanya, Pawan Kalyan-TeluguStop.com

అలాగే ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసినా, ఎలా ట్రోల్ చేసినా కూడా అది వారి జీవితాలను తీవ్ర ప్రభావితం చేస్తుంది.అలా మన టాలీవుడ్ లో విడాకులు తీసుకున్న పాపానికి కెరియర్ ని పూర్తిగా కోల్పోయిన నటిమణులు ఉన్నారు.వారెవరో ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం.

సమంత

సమంత ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్ గా అడుగుపెట్టింది.ఆ తర్వాత తనదైన నటనతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.ఇక అక్కినేని ఇంటి కోడలుగా మారాక ఆమె ఇమేజ్ మొత్తం మారిపోయింది.

 Tollywood Heroines Career Collapsed After Divorce Tollywood, Samantha , Divorce, Sarika , Kamal Hassan, Renu Desai, Naga Chaitanya, Pawan Kalyan-విడాకుల కారణంగా కెరియర్ కోల్పోతున్న టాలీవుడ్ హీరోయిన్స్ -,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ వస్తున్న సినిమా అవకాశాల దృష్ట్యా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు.కానీ విడాకుల అనంతరం అక్కినేని అభిమానుల ఆగ్రహానికి సమంత గురైంది.

వారు చేసే కామెంట్స్ ఆమెను చాలా బాధించాయి.అంతేకాదు ప్రస్తుతం తెలుగులో ఆమెకు అవకాశాలు కూడా లేవు పూర్తయిన ఒక రెండు సినిమాలు మినహా ఆమె ఎలాంటి కొత్త సినిమాలకి సైన్ చేయడం లేదు.ఒకరకంగా చెప్పాలంటే టాలీవుడ్ లో సమంత పని అయిపోయినట్టే అని అనుకోవాలి.

సారిక

బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినీ ప్రయాణం మొదలెట్టిన సారిక, ఆ తర్వాత హీరోయిన్ గా సైతం తనదైన ముద్రను వేసుకుంది.సినిమాల్లో ఒక స్టార్ హీరోయిన్ గా పిక్ లో ఉన్న సమయంలో కమల్ హాసన్ తో ప్రేమలో పడింది.ఆ తర్వాత పెళ్లి కాకుండానే శృతిహాసన్ కడుపులో పడడంతో పెళ్లి అనివార్యంగా మారింది.

కానీ వీరి వైవాహిక జీవితం ఎక్కువ కాలం కొనసాగలేదు.సారిక పెళ్లి వల్ల తన సినిమా జీవితాన్ని పక్కన పెట్టింది.

ఒకరకంగా చెప్పాలంటే కమల్ హాసన్ తో విడాకుల తర్వాత ఆమె పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పింది.అలా కమలహాసన్ తో విడాకులే సారిక జీవితాన్ని నాశనం చేశాయి.

రేణు దేశాయ్

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పరిస్థితి కూడా అచ్చం సమంతా, సారికల లాగానే సాగింది.రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు పుట్టాక రేణు దేశాయ్ తో విడాకులు తీసుకొని మరొక వివాహం చేసుకున్నాడు పవన్.విడాకుల తర్వాత రేణు దేశాయ్ కి పవన్ కళ్యాణ్ అభిమానుల దాడి మొదలైంది.

నిజం చెప్పాలంటే పవన్ కోసమే తను నటించడం మొదటి సినిమాతోనే ఆపేసింది.ఆ తర్వాత పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది తర్వాత రేణు దేశాయి సినిమా జీవితం ముగిసిపోయిందని చెప్పాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube