తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే ( Pooja Hegde )గురించి మనందరికీ తెలిసిందే.మొన్నటి వరకు వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోయిన పూజా హెగ్డే ఈ మధ్యకాలంలో కాస్త స్లో అయిందని చెప్పవచ్చు.
అందుకు గల కారణం ఆమె నటించిన సినిమాలు అన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అవడం.ఇకపోతే పూజా హెగ్డే చివరగా గత ఏడాది విడుదలైన కిసికా భాయ్ కిసికా జాన్( Kisika Bhai Kisika John ) సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరవాలేదు అనిపించింది.

ఈ సినిమా కంటే ముందు విడుదలైన బీస్ట్, రాధేశ్యామ్, ఆచార్యా సినిమాలు ఫ్లాప్ అవడంతో పూజా హెగ్డే కెరియర్ కాస్త డల్ అయ్యింది.దాంతో ఐరన్ లెగ్ అంటూ పూజ హెగ్డే ని విమర్శించడం మొదలుపెట్టారు.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం ఖాళీగానే ఉంటోంది.
అప్పుడప్పుడు పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ ఉంటుంది పూజా హెగ్డే.అయితే సినిమా అవకాశాలు లేకపోయినప్పటికీ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేయడంతో ఆ ఫోటోలపై నేటిజన్స్ పిజ్జా హెగ్డే ( Pizza Hegde )అంటూ కామెంట్ చేస్తున్నారు.

తాజాగా పెద్ద పిజ్జాతో పూజా కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది.అంత పెద్ద పిజ్జాను చేతిలోకి తీసుకుని ఆమె తీనేస్తుందా ఏంటీ అన్నట్టుగా ఫోజు ఇచ్చింది.ఇంతకీ ఈ పీజ్జా కథ ఏంటంటే.
నిన్న ఫిబ్రవరి 9 వరల్డ్ పిజ్జా డే కావడంతో ఒక పిజ్జా షాప్ లో మాములు పిజ్జా సైజుకి నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉండే ఒక పిజ్జాని పట్టుకొని పూజా హెగ్డే ఫోటోలకు పోజులిచ్చింది.ఇక ఆ ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి హెవీ వెయిట్ లిఫ్టింగ్ అంటూ సరదాగా పోస్ట్ చేసింది.
దీంతో పిజ్జాతో పూజాహెగ్డే ఫొటోలు వైరల్ అవుతున్నాయి.కొందరు సరదాగా పూజా హెగ్డే కాదు పిజ్జా హెగ్డే అని కామెంట్స్ చేస్తున్నారు.కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తుండగా మరికొందరు పాజిటివ్‌గా కామెంట్స్ చేస్తున్నారు.







