వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర గంజాయికి రాజధానిగా మారిందని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు.జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు.
మూడు రాజధానులు అన్నారు.ఒక్కటైనా కట్టారా అని ప్రశ్నించారు.
విశాఖలో రైల్వేజోన్ కోసం కనీసం భూమి కూడా ఇవ్వలేదని చెప్పారు.టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతీ ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు.మహిళలకు ప్రతి నెల రూ.1500 ఇస్తామన్న లోకేశ్ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు.కష్టకాలంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమకు అండగా నిలిచారని పేర్కొన్నారు.అయితే కొందరు కుట్రపూరితంగా టీడీపీ – జనసేన మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు.
ఈ క్రమంలోనే ఫేక్ పోస్టుల పట్ల టీడీపీ – జనసేన నేతలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.