టాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ కేరళ బ్యూటీ నయనతార.తన అందంతో, నటనతో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.
మలయాళం సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నయనతార ఆ తర్వాత తెలుగులో కూడా ఎన్నో సినిమాలలో నటించింది.ఇక తను నటించే పాత్రకు మాత్రం ప్రాణం పోసేలా నటిస్తుంది.
అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.
ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతోంది.ఇదిలా ఉంటే తాజాగా రూల్స్ బ్రేక్ చేసింది నయనతార.
తెలుగు, మలయాళం లోనే కాకుండా తమిళ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.తన వయసుకు తగ్గ పాత్రలలోనే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో కూడా నటిస్తుంది.
ఇక ఇప్పటికీ వరుసగా ఎన్నో సినిమాలలో నటిస్తుంది.ఇదిలా ఉంటే నయనతారకు కొన్ని కండిషన్ లు ఉన్నాయి.
ఇంత హోదాలో ఉన్న కూడా ఈమె ఒక రూల్ ను పాటిస్తుంది.సినిమాలో కేవలం తన నటన వరకే మాత్రమే ఆసక్తి చూపుతుంది.
కానీ ప్రమోషన్ లకు మాత్రం పాల్గొనని ముందే కమిట్మెంట్ తీసుకుంటుంది నయనతార.

ఆమె ఏ సినిమా గురించైనా కథ విన్నప్పుడు ఆ తర్వాత ప్రమోషన్స్ గురించి అసలు పట్టించుకోనని స్పష్టం చేస్తుంది.అలా చాలా వరకు నయనతార ఏ సినిమా గురించి ఎటువంటి ప్రమోషన్లు ఇవ్వదు.కానీ తాను నటించిన శ్రీరామరాజ్యం సినిమాకు మాత్రం ఆడియో ఫంక్షన్ కి మాత్రమే హాజరయ్యింది.
ఇక ఏ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కు పాల్గొనదు.అలా చాలా మంది ఆమెపై రకరకాలుగా విమర్శలు చేశారు.
అయినా కూడా వాటిని పట్టించుకోకుండా తన పని తాను చూసుకుంటుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె వరుస సినిమాలలో నటిస్తుంది.ఇక తాజాగా తాను నటించిన నెత్రికన్ సినిమా విడుదల కాగా.ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి పాల్గొన్నది.
ఓ రేడియో ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది.దీంతో చాలామంది ఈమెను మళ్లీ విమర్శిస్తున్నారు.
ఎందుకంటే ఈ సినిమా తన బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ నిర్మించడంతో.అందుకే ఈ సినిమాకు ఇంటర్వ్యూలో పాల్గొన్నదని కామెంట్ చేస్తున్నారు.
అంతే కాకుండా టాలీవుడ్ సినీ నిర్మాతలు కూడా ఈమె పై విమర్శలు చేయగా ఈ విషయం గురించి స్పందించింది నయనతార.ఈ సినిమాకు ముందుగానే ప్రమోట్ చేస్తానని ఒప్పుకున్నానని మిగతా సినిమాలకు ఒప్పుకోలేదు కాబట్టి చేయలేదు అంటూ తెలిపింది.
దీంతో నయన రూల్స్ బ్రేక్ చేసిందంటూ తెగ ఫైర్ అవుతున్నారు.







