ఈ ఫోటో లో కనిపిస్తున్న క్యూట్ బేబీ ఎవరో గుర్తుపట్టారా.బాగా గమనించినట్లయితే ఆ పాప ఓ స్టార్ హీరో కూతురే కాకుండా.
ప్రస్తుతం హీరోయిన్ గా నటిస్తుంది.ఈ పాప తండ్రి తెలుగు సినిమాలలో నటించి తన నటనకు యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరు సంపాదించుకున్నాడు.
తన తల్లి కూడా ఓ నటి.ఇప్పటికైనా గుర్తుపట్టారా.ఆయన ఎవరో కాదు స్టార్ హీరో రాజశేఖర్.అవును ఆ ఫోటో లో ఉన్న ఆ క్యూట్ బేబీ రాజశేఖర్, జీవిత ల కూతురే శివాత్మిక.
రాజశేఖర్, జీవిత లకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు.అందులో శివాత్మిక ప్రస్తుతం తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది.
మొదట విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన దొరసాని సినిమా లో హీరోయిన్ గా నటించింది శివాత్మిక.ఆ సినిమాలో తన తొలి సారి నటనకు మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
ప్రస్తుతం శివాత్మిక ఆ సినిమా తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో మరో సినిమా రంగ మార్తాండ అనే సినిమాలో నటిస్తుంది.ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
ఇక తాజాగా తన చిన్ననాటి ఫోటోను శివాత్మిక తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకోగా ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అందులో శివాత్మిక ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ తో వైట్ కలర్ డ్రెస్ లో ఎంతో క్యూట్ గా కనిపిస్తుంది.
అంతేకాకుండా తనకు సంబంధించిన మరిన్ని ఫోటోలు తన ఖాతాలో షేర్ చేయగా ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.