అందుకే జగపతి బాబు తన ఖరీదైన కారును తక్కువ ధరకే అమ్మేసాడట....

అప్పట్లో పలు ఫ్యామిలీ ఓరియంటెడ్ మరియు ఎమోషనల్ తరహా చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా వెలుగొందిన "సీనియర్ హీరో జగపతి బాబు" గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే ఒకానొక సమయంలో జగపతి హీరోగా అవకాశాలు లేకపోవడంతో కొంత మేర గడ్డుకాలం ఎదుర్కొన్నప్పటికీ మళ్లీ విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి బాగానే క్లిక్ అయ్యాడు.

అయితే జగపతి బాబు తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా తన సినీ జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.

ఈ క్రమంలో తాను ఒకప్పుడు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్న సంగతి వాస్తవమేనని నిర్మొహమాటంగా తెలిపాడు.కానీ ఆ పరిస్థితుల్లో చాలా విషయాలు తెలుసుకున్నానని అందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు.

అంతేగాక ప్రస్తుత మానవ జీవితంలో డబ్బు అనేది ముఖ్యం అయినప్పటికీ అది మన కనీస అవసరాలకు ఎంత ఉండాలో అంత ఉంటే మంచిదని అవసరానికి మించిన డబ్బు కూడా చాలా ప్రమాదకరమని తెలిపాడు.అంతేగాక తాను ఒకప్పుడు హీరోగా బాగానే రాణిస్తున్న సమయంలో తన కారు అంటే తనకు చాలా ఇష్టమని కానీ సరిగ్గా అదే సమయంలో కారుపై తనకి ఎందుకు అంత ప్రేమ కలిగిందో అర్థం కాలేదని, దాదాపుగా25 లక్షల రూపాయల విలువ చేసే కారు 10 లక్షల రూపాయలకి  అమ్మేసానని తెలిపాడు.

Advertisement

అంతేగాక మనుషులపై ఉండాల్సిన ఆప్యాయతలు, అనురాగాలు వస్తువులపై మొదలైతే మానవ జీవితానికి అర్థం లేదని అభిప్రాయం వ్యక్తం చేసాడు. అంతేగాక ఒకసారి డబ్బు మీద ప్రేమ అనురాగాలు మొదలైతే విలువ ఇవ్వాల్సిన వాటికి విలువ ఇవ్వకుండా కేవలం డబ్బు పై మాత్రమే మనసు కలుగుతుందని ఒక్కసారి ఆ ఊబిలో ఇరుక్కుంటే దాని నుండి బయట పడడం చాలా కష్టమని తెలిపాడు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు