తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రాబోయే తరం స్టార్ హీరోలు వీరే !

తెలుగు సినిమా అంటే ఒక ఎన్టీఆర్, ఒక అక్కినేని , ఒక కృష్ణ .

ఈ జెనరేషన్ దాటితే ఒక చిరంజీవి, మరొక నాగార్జున, లేదంటే చిరంజీవి.

ఈ హద్దులు చెరిపేసి ఇంకో తరం హీరోలు తెరపైకి వస్తున్నారు.ఇన్నాళ్లు కేవలం వారసులమని చెప్పుకునే హీరోలు చాలామంది వచ్చిన ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ట్యాలెంట్ కి మాత్రమే అవకాశాలు దక్కుతున్నాయి.

సినిమా లో అవకాశం కోసం క్యూ లు కట్టే రోజు నుంచి వారి సినిమాకి వారే అన్ని బాధ్యతలు మోసుకుంటూ సరికొత్త అవకాశాలను సృష్టించుకంటూన్నారు.ఎవరో అవకాశం ఇస్తారని ఎదురు చూడటం లేదు.

తమలో టాలెంట్ ఉంటె, కథ, మాటలు వంటి వాటిల్లో తమ ప్రతిభ ఏంటో చూపిస్తూ ముందుకు వెళ్తున్నారు.మొన్నటికి మొన్న జాతి రత్నాలు సినిమాతో తెలుగు తెరకు నవీన్ పోలిశెట్టి వంటి మంచి హీరో దొరికాడు.

Advertisement

అంతకు ముందు శేఖర్ కమ్ముల సినిమా అయినా లైఫ్ బ్యూటిఫుల్ సినిమాలో చిన్న ఆర్టిస్ట్ గా నటించాడు.ఆ తర్వాత తనను తాను ప్రూవ్ చేసుకొని ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో ఫస్ట్ సక్సెస్ ను చవి చూసాడు.

ఆ తర్వాత జాతి రత్నాలు సినిమా అతడిని స్టార్ హీరోను చేసింది.ఇక భవిష్యత్తు లో అతడు నెంబర్ వన్ హీరో అవ్వడం లో ఎలాంటి ఆశ్చర్యం లేదు.

ఇక నవీన్ లాగానే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా హీరో అయినా మరొక నటుడు సిద్దు జొన్నలగడ్డ.రీసెంట్ గా వచ్చిన డీజే టిల్లు సినిమా అతడి కెరీర్ ను అమాంతం పెంచేసింది.అంతకు ముందు అనేది చిన్న సినిమాల్లో నటించిన అంతగా గుర్తింపు రాలేదు.

కానీ సిద్దు సైతం అతి త్వరలో స్టార్ హీరోల్లో నంబర్ వన్ హీరో అవ్వడం మాత్రం ఖాయం గా కనిపిస్తుంది.ఇక ఈ హీరోల తరహాలోనే కిరణ్ సబ్బవరం, సత్యదేవ్, విశ్వక్ సేన్ వంటి హీరోలు తమ తమ సినిమాలతో జనాల్లో క్రేజ్ పెంచుకొని ఫ్యూచర్ స్టార్ హీరోస్ మారడానికి సిద్ధం అవుతున్నారు.

కేంద్రం కీలక నిర్ణయం..బంగారం,వెండిపై సుంకాలు డబుల్
ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్‌ను సందర్శించిన మంత్రి కొండపల్లి

ఒక తరం హీరోలు వెళ్ళిపోతే వీరంతా మినిమమ్ బడ్జెట్ హీరోలుగా మారె అవకాశం కూడా ఉంది.అయితే సరైన కథలను ఎంచుకుంటే మాత్రమే ఈ హీరోల క్రేజ్ ఇలాగె కొనసాగుతుంది.

Advertisement

లేదంటే కలగర్భం లో కలిసిపోయిన అనేక మంది హీరోల జాబితాలో వీరు కూడా చేరుతారు.

తాజా వార్తలు