తెలుగు సినిమాలో ఈ ఇద్దరి దర్శకుల సోదరులు రాజకీయాల్లో యమ బిజీగా ఉన్నారు.తెలుగులో మీరు దర్శకులుగా టాప్ రేంజ్ లో ఒక స్థాయిలో ఉంటే, ఇక సదరు డైరెక్టర్ల బ్రదర్స్ మాత్రం రాజకీయాలతో ( Politics ) చాలా బిజీగా ఉన్నారు.
ఏ రోజు రాజకీయాల గురించి మన తెలుగు దర్శకులు మాట్లాడింది లేదు.తమ తోడబుట్టిన వారు ఇలా రాజకీయాల్లో ఉన్నారని, వారు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కూడా పనిచేస్తున్నారని ఆ పలుకుబడిని కూడా ఎప్పుడు వాడుకున్నట్టుగా కనిపించలేదు.ఇంతకీ తెలుగు సినిమాలో ఇండస్ట్రీలో రాణిస్తున్న ఆదర్శకులు ఎవరు వారి తోడబుట్టిన ఆ రాజకీయ నాయకులు ఎవరు అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పూరి జగన్నాథ్ – ఉమా శంకర గణేష్

టాలీవుడ్ లో మోస్ట్ డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.( Director Puri Jagannadh ) ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నారు ఇక పూరి జగన్నాథ్ తోడ బుట్టిన ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకరు వైసిపి నుంచి నర్సాపట్నం ఎమ్మెల్యే అయిన ఉమా శంకర గణేష్.( MLA Uma Sankara Ganesh ) మరొక సోదరుడు సాయిరాం శంకర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో గానే ఉన్నాడు.
తను దర్శకుడుగా ఎన్నోసార్లు ఎత్తు పలాలను చూసినా ఏ రోజు కుటుంబం పలుకుబడిని వాడుకోలేదు పైగా కుటుంబంలో వారిని కూడా వాడుకోలేదు.వీరి సోదరులు కూడా రాజకీయాల్లో అంత బిజీగా ఉన్నప్పటికీ పూరి జగన్నాథ్ వచ్చి ప్రచారం చేసి వారిని గెలిపించాలని ఏనాడు ఉమా శంకర్ గణేష్ కూడా ఆశించలేదు.
కురసాల కళ్యాణ్ కృష్ణ – కన్న బాబు

వైసీపీలో ఎమ్మెల్యేగా మరియు మంత్రిగా పని చేసిన కన్న బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కన్నబాబు పూర్తి పేరు కురసాల కన్నబాబు. ( Kurasala Kanna Babu ) అతని సోదరుడే కురసాల కళ్యాణ్ కృష్ణ.ఈ కళ్యాణ్ కృష్ణ( Director Kalyan Krishna ) మరెవరో కాదు.
సోగ్గాడే చిన్నినాయన, రారండోయ్ వేడుక చూద్దాం, నేల టికెట్, బంగార్రాజు వంటి సినిమాలు దర్శకత్వం వహించినటువంటి కళ్యాణ్ కృష్ణ.నాగార్జునకు ఎంతో దగ్గర వాడైన కళ్యాణ్ కృష్ణ సినిమా ఇండస్ట్రీలో రాణిస్తూనే నిర్మాతగా కూడా అవతారం ఎత్తాడు.
కానీ కళ్యాణ్ కృష్ణ ఏ రోజు తన పలుకుబడిని వాడుకోలేదు.అలాగే కన్నబాబు కూడా తన తమ్ముడు గొప్ప దర్శకుడు అయినంత మాత్రాన తనకు క్యాంపెయిన్ చేసి పెట్టాలని ఎదురు చూడలేదు.