దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తెలుగు సినిమా లు భగవంత్ కేసరి మరియు టైగర్ నాగేశ్వరరావు సినిమా ( Tiger Nageswara Rao )లు ఒక మోస్తరు టాక్ ను దక్కించుకున్నాయి.అయితే దసరా హాలీడేస్ అవ్వడం వల్ల మంచి వసూళ్లు నమోదు అయ్యాయి.
ఇప్పటికే భగవంత్ కేసరి సినిమా వంద కోట్ల వసూళ్లు నమోదు చేస్తే టైగర్ నాగేశ్వరరావు సినిమా లాంగ్ రన్ లో కచ్చితంగా వంద కోట్ల వసూళ్లు నమోదు చేస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

ఇక తమిళ డబ్బింగ్ మూవీ లియో( LEO ) ని మాత్రం తెలుగు బాక్సాఫీస్ ప్రేక్షకులు పట్టించుకోలేదు.తమిళ్ లో గతం లో వచ్చిన విజయ్ సినిమా లు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.అప్పుడు కూడా తెలుగు లో ఆ సినిమా లు ఆడలేదు.
ఇప్పుడు లియో సినిమా ను తెలుగు లో విడుదల చేసినా కూడా పెద్దగా ఫలితం లేకుండా పోయింది.గత వారం నుంచి తెలుగు బాక్సాఫీస్ ను బాలయ్య మరియు రవితేజ( Ravi Teja ) లు మాత్రమే సందడి చేస్తున్నారు.
ఇప్పుడు బాలయ్య మరియు రవితేజ లు మరో వారం కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రేపు తెలుగు బాక్సాఫీస్ వద్దకు పెద్దగా సినిమా లు రావడం లేదు.అయిదు ఆరు సినిమా లు వస్తున్నా కూడా అందులో ఒకటి రెండు మాత్రమే కాస్త పర్వాలేదు అన్నట్లుగా క్రేజ్ ని కలిగి ఉన్నాయి.ఆ సినిమా ల్లో కూడా ఏది ఎంత వరకు వర్కౌట్ అయ్యేది అనేది క్లారిటీ లేదు.
అందుకే దసరా సినిమా లే వచ్చే వారం లో కూడా సందడి చేస్తాయి అంటూ మొదటి నుంచి కూడా ప్రచారం జరుగుతోంది.అందుకే ఈ వారం లో కూడా భగవంత్ కేసరి ( Bhagavanth Kesari )మరియు టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ) లు సందడి చేయబోతున్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అదే నిజం అయితే బాలయ్య సినిమా వంద కోట్లు దాటింది కనుక రెండు వందల కోట్లకు ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు.ఇక టైగర్ బాబు ఈజీగా వంద కోట్ల ను క్రాస్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.