కరీంనగర్ జిల్లాలోని కేబుల్ బ్రిడ్జి వద్ద సీపీఐ ధర్నా నిర్వహించింది.బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన వంతెన నిర్మాణాలు నాణ్యతగా లేవని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు.
కేబుల్ బ్రిడ్జి దగ్గర నిర్మించిన చెక్ డ్యాంలు కొట్టుకుపోయాయని సీపీఐ నేతలు విమర్శించారు.స్వప్రయోజనాల కోసమే కేబుల్ బ్రిడ్జిని నిర్మించారన్నారు.
నాణ్యతగా లేని వంతెనలు, బ్రిడ్జిల నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.







