టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటిస్తున్న చిత్రం పుష్ప 2( Pushpa 2 ).2021 లో విడుదల అయిన పుష్ప 1 కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.అనసూయ సునీల్ వంటి వారు కీలక పాత్రలో నటిస్తున్నారు.పుష్ప 2 కోసం దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.అందుకు అనుగుణంగా మూవీ మేకర్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఒకేసారి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే వ్యూహంతో నిర్మాణం చేపడుతున్నారు.

ఫస్ట్ పార్ట్ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.భాషతో సంబంధం లేకుండా పుష్ప మేనరిజమ్ తో డైలాగ్‌తో ప్రపంచం మొత్తం ఊగిపోయింది.ఆ రెస్పాన్స్ ని దృష్టిలో ఉంచుకొని కొనసాగింపుగా వస్తున్న పుష్ప: ది రూల్ ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కించడంతో పాటు, ఒకేసారి పలు భాషల్లో ఒకేసారి విడుదల చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు నిర్మాతలు.పుష్ప: ది రూల్ సినిమాని మాత్రం భారత్‌లో విడుదల చేసిన రోజునే, ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రకటించింది.రష్యాతో పాటు 20కి పైగా దేశాల్లో సినిమాని ఒకేసారి విడుదల చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్టు సమాచారం.

ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓవర్ సీస్ ఎంక్వైరీలు మొదలయ్యాయి.పుష్ప2 చిత్రం ఓవర్ సీస్ రైట్స్ 100 కోట్లు చెప్తున్నట్లు సమాచారం.మరో ప్రక్క ప్రభాస్( Prabhas ) ప్రతిష్టాత్మక చిత్రం #Salaar ఓవర్ సీస్ రైట్స్ 72 కోట్లు కు ఫైనల్ చేసారు.
ఇప్పుడు పుష్ప2 రైట్స్ రేటు ఫైనల్ కాకపోనప్పటికీ పెద్ద మొత్తమే అని తెలుస్తోంది.అంటే ప్రభాస్ సలార్ సినిమాను మించి 30 కోట్లు ఎక్కువ అమ్ముడు కాబోతున్నట్లు తెలుస్తోంది.
కాగా ఇప్పటికే పుష్పటు సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.







