కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదని పెద్దలు చెబుతూ ఉంటారు.అయితే సినీ ఇండస్ట్రీలోని కొంతమంది హీరోయిన్లు, నటీమణులు మాత్రం వయస్సు పెరుగుతున్నా పెళ్లి వైపు ఆసక్తి చూపించడం లేదు.
పెళ్లి చేసుకుంటే సినిమాల్లో అవకాశాలు తగ్గుతాయని ఆజన్మ బ్రహ్మచారిణులుగానే ఉండిపోతున్నారు.సినీ రంగంలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నా ఆర్థికంగా స్థిరపడినా కొందరు హీరోయిన్లు, నటీమణులు పెళ్లి ఊసు ఎత్తడానికే ఆసక్తి చూపించడం లేదు.
రాగిణి
: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి దగ్గరలోని ఒక గ్రామానికి చెందిన రాగిణి చిన్నప్పటినుంచే కుటుంబ బాధ్యతలు మీద పడటంతో పెద్దగా చదువుకోలేకపోయారు.నటనపై ఆసక్తితో హైదరాబాద్ కు వచ్చి ఆకలిబాధతో అలమటించారు.
ఒకానొక సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న రాగిణి 550కు పైగా సీరియళ్లు, 200కు పైగా సినిమాల్లో నటిగా రాణించారు.కుటుంబ సభ్యులకు అండగా నిలబడిన రాగిణి వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపలేదు.

రజిత
: తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన నటి రజిత.చిన్నప్పటి నుంచి యాక్టర్ కావాలని అనుకున్న రజిత అనుకోని విధంగా నటి అయింది.భక్తి భావం ఎక్కువగా ఉండే రజిత పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకుని ఆ నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు.
సితార : కేరళలోని నాయర్ల కుటుంబంలో పుట్టిన సితార ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం.1989లో బాలచందర్ దర్శకత్వంలో నటించి కెరీర్ మొదలుపెట్టిన సితార తెలుగు, కన్నడ, మలయాళంలో వందల సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.సహనటుడు మురళితో ప్రేమలో పడిన సితార ప్రేమ బంధం ఎందుకో పెళ్లి బంధంగా మారలేదు.
శోభన
: తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో శోభన ఒకరు.నటిగా, డ్యాన్సర్ గా శోభన దేశవ్యాప్తంగా సుపరిచితం.1972లో చైల్డ్ ఆర్టిస్ట్ గా శోభన కెరీర్ ను ప్రారంభించి మలయాళంలో దాదాపు 230 సినిమాల్లో నటించారు.తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో వందల సినిమాల్లో నటించారు.ఈమె వివాహం పట్ల ఆసక్తి చూపలేదు కానీ ఒక పాపను దత్తత తీసుకుంది.
నగ్మా
: టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన హీరోయిన్లలో నగ్మా ఒకరు.దక్షిణాది భాషల్లోని అగ్ర హీరోలందరితో నటించింది.ప్రస్తుతం కాంగ్రెస్ లో కొనసాగుతున్న ఈ హీరోయిన్ కొంతమందితో ప్రేమాయణం నడిపినా ఎందుకో పెళ్లిపై మాత్రం ఆసక్తి చూపలేదు.