ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు ఆర్థిక చేయూతనందిస్తోంది.ఈ పథకం 9వ విడతలో భాగంగా ఈరోజు (సోమవారం) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్యాహ్నం 12:30 గంటలకు రైతుల ఖాతాలక బదిలీ చేయనున్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా పాల్గొననున్నారు.వీడియో సమావేశంలో ప్రధాని కిసాన్ డబ్బులను విడుదల చేయనున్నారు.ఈ పథకం ద్వారా రైతుల ఖాతాలో రూ.19,500 కోట్లకు పైగా దాదాపు 9.75 కోట్ల రైతు కుటుంబాలు లబ్ధి పొందనున్నారు.అంతేకాదు ఈరోజు జరనున్న సమావేశంలో ప్రధాని మోడీ రైతులతో కూడా సంభాషించనున్నారు.
దాంతోపాటు దేశాన్ని ఉద్దేశించి కూడా ప్రసంగించనున్నారని ప్రధాన మంత్రి కార్యాలయ అధికారిక ప్రకటించింది.ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద పీఎం మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాది రూ.6 వేలను.3 వాయిదాల్లో, రెండు హెక్టార్ల భూస్వాములు లేదా యజమాన్యం కలిగిన రైతులకు అందించనున్నారు.అర్హులైన లబ్ధిదారులకు నేరుగా బ్యాంకులోనే ఈ పథకం డబ్బులు జమ చేస్తోంది.
పీఎం కిసాన్ వాయిదాను ఆన్‌లైన్‌లో చెక్ చేసే విధానం
– కేంద్ర ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in హోం పేజీలో ఫార్మార్స్ కార్నర్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.అందులో ‘బెనిఫిషియరీ స్టేటస్’ను ఎంపిక చేసుకోవాలి.అందులో దరఖాస్తుదారుల స్థితిని తనిఖీ చేసే అవకాశం ఉంటుంది.ఇందులో లబ్ధిదారుడి ఆధార్ నంబర్ లేదా ఖాతా నంబర్ లేదా మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.అప్పుడు వెంటనే గెట్ డేటాపై క్లిక్ చేస్తే సరిపోతుంది.

పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాను చెక్ చేసుకునే విధానం
వెబ్‌సైట్ హోం పేజీలోని ‘ఫార్మర్స్ కార్నర్’ను ఎంపిక చేసుకుని లబ్ధిదారుల జాబితాపై క్లిక్ చేయాలి.అందులో మీ రాష్ట్రం, జిల్లా, సబ్ డిస్ట్రిక్, బ్లాక్, గ్రామం ఎంచుకోవాలి.ఆ తర్వాత ట్యాప్ రిపోర్ట్’పై క్లిక్ చేయాలి.