విజయవాడలో ఇవాళ టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ రెండోసారి సమావేశం కానుంది.ఈ భేటీలో రెండు పార్టీలకు చెందిన సమన్వయ కమిటీ సభ్యులు హాజరుకానున్నారు.
ఇందులో భాగంగా పూర్తి స్థాయి ఉమ్మడి మ్యానిఫెస్టో రూపకల్పనపై రెండు పార్టీలు దృష్టి సారించనున్నాయి.మ్యానిఫెస్టో ప్రకటనలోపు ఓ కరపత్రం రూపకల్పనపై కూడా నేతలు ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఈ నేపథ్యంలో టీడీపీ – జనసేన వంద రోజుల ప్రణాళికను సిద్ధం చేసుకోనుంది.అదేవిధంగా ఓటరు జాబితా అవకతవకలపైనా ఉమ్మడి పోరుకు వ్యూహాన్ని రచించనున్నారు నేతలు.
అయితే ఉమ్మడి జిల్లాల స్థాయిలో ఇప్పటికే ఆత్మీయ సమావేశాలు పూర్తయిన సంగతి తెలిసిందే.కాగా తాజాగా నియోజకవర్గాల స్థాయిలో ఆత్మీయ సమావేశాల నిర్వహణపై ఇరు పార్టీలకు చెందిన నేతలు నిర్ణయం తీసుకోనున్నారు.







