ఖమ్మంలో ఇవాళ పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం

ఖమ్మంలో ఇవాళ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం హాజరుకానున్నారు.

ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు చివరి దశకు వచ్చాయని తెలుస్తోంది.ఈ క్రమంలోనే తొమ్మిది నియోజకవర్గాల్లో ఆయన ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగాయి.

అయితే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన పొంగులేటి ఏ పార్టీలో చేరేది ఇంకా డిసైడ్ కాలేదు.మరోవైపు పొంగులేటితో ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపిన విషయం తెలిసిందే.

ఈ మేరకు జూన్ 2వ తేదీన పార్టీ మార్పుపై పొంగులేటి కీలక ప్రకటన చేయనున్నారు.

Advertisement
ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు