బీజేపీ పోలింగ్ బూత్ స్వశక్తికరుణ సమావేశం ఇవాళ జరగనుంది.తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన ఈ మీటింగ్ ను నిర్వహించనున్నారు.
సంజయ్ నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశానికి బీజేపీ ఇంఛార్జ్ లు సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్ తో పాటు అరవింద్ మీనన్ లు హాజరుకానున్నారు.ఇందులో భాగంగా ప్రజాగోస – బీజేపీ భరోసా కార్యక్రమంపై సునీల్ బన్సాల్ సమీక్ష నిర్వహించనున్నారు.
అదేవిధంగా కార్నర్ మీటింగ్స్ పై కూడా కమలదళం ప్రత్యేక దృష్టి సారించనుంది.ఈ మేరకు అన్ని పోలింగ్ బూత్ లలో పూర్తిస్థాయి కమిటీలపై కసరత్తు మొదలుపెట్టిన విషయం తెలిసిందే.







