యంగ్ హీరోల్లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఒకరు.ఈయన ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్దీ సమయంలోనే భారీ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకుని స్టార్ హీరోల సరసన చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.
అందుకోసం విజయ్ చాలానే కష్ట పడుతున్నాడు.లైగర్ కనుక హిట్ అయి ఉంటే ఇప్పటికే స్టార్ హీరో అయిపోయి ఉండే వాడు.
కానీ అలా జరగలేదు.

ఇక ఇటీవలే విజయ్ ఖుషి సినిమాతో హిట్ అందుకున్నాడు.కానీ ఈ సినిమా ఇతడికి బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇవ్వలేక పోయింది.దీంతో మళ్ళీ ఒక అడుగు దూరంలోనే ఆగి పోయాడు.
ఖుషి తర్వాత మరో రెండు సినిమాలను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాడు.అందులో పరశురామ్ తో చేస్తున్న ప్రాజెక్ట్ (VD13) ఒకటి.
విజయ్ కు గీతా గోవిందం వంటి ఘన విజయం అందించిన పరశురామ్ తో మరోసారి చేతులు కలిపాడు.ఈ కాంబోపై ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి.
ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో విజయ్ కు జోడిగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ”VD13” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.ఈ సినిమా సంక్రాంతికి అని ప్రకటించడంతో టీమ్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు.

మరో వైపు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయడానికి సిద్ధం అయ్యారు.తాజాగా మేకర్స్ టైటిల్ ను (VD13 Title Glimpse) రివీల్ చేయనున్నట్టు తెలిపారు.టైటిల్ నామకరణము అంటూ అక్టోబర్ 18న సాయంత్రం 6 గంటల 30 నిముషాలకు ప్రకటించనున్నట్టు తెలిపారు.దీంతో టైటిల్ టీజర్ రాబోతుందని ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు.
చూడాలి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో.







