టైర్లకు నిమిషాల్లోనే గాలి కొట్టుకోవచ్చు.. మార్కెట్‌లోకి మినీ పంప్‌లు..

బైక్‌లు, కార్లు, సైకిళ్లు.ఇలా టైర్లతో కూడుకున్న ఏ వాహనానికైనా సరే.

 Tires Can Be Inflated Within Minutes Mini Pumps In The Market , New, Cycle Pumps-TeluguStop.com

గాలి అవసరం ఉంటుంది.టైర్లకు( tires ) గాలి తగ్గిపోవడం వల్ల వాహనం ఎక్కువ మైలేజ్ రాకపోవడంతో పాటు స్లో అవుతుంది.

గాలి లేకపోతే వాహనం వేగంగా వెళ్లదు.దీంతో గాలి తగ్గినప్పుడు వెంటనే టైర్లకు గాలి కొట్టించుకోవాల్సి ఉంటుంది.

టైర్లకు గాలి కొట్టించుకోవడానికి మెకానిక్ షాపు లేదా పంచర్ షాపు లేదా పెట్రోల్ బంకుల్లో ఉండే ఎయిర్ షాపుకు తీసుకెళతాం.ఇక రోడ్డు మధ్యలో పంచర్ పడి గాలి పోతే ఇంక చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

అలాంటి వాహనాలను దగ్గల్లోని మెకానిక్ షాపులకు తోసుకెళ్లడమో లేదా వేరే వెహికల్ సహయంతో తీసుకెళ్లడమో చేస్తూ ఉంటాం.

అయితే వాహనాలు మధ్యలో గాలి లేక ఆగిపోయినప్పుడు ఇక ఇబ్బందులు పడాల్సిన అవసరమే లేదు.

మినీ పంప్( Mini pump ) ద్వారా మీరే గాలి కొట్టుకోవచ్చు.అమెరికాకు చెందిన థామస్ పంప్స్ కంపెనీ( Thomas Pumps Company ) చేతిలో ఇమిడిపోయే మినీ పంప్ ను ఆవిష్కరించింది.

ఈ పంప్ ను ఎంచక్కా జేబులో పెట్టుకోవచ్చు.దీని బరువు కేవలం 115 గ్రామాలు మాత్రమే ఉంటుంది.వాహనం టైర్లలోని గాలి అయిపోతే వెంటనే ఎక్కడికక్కడ గాలి నింపుకోవచ్చు.రీఛార్జబుల్ బ్యాటరీ సాయంతో ఇది పనిచేస్తుంది.

ఈ బ్యాటరీ 25 నిమిషాల్లోనే పూర్తిగా ఛార్జ్ అవుతుంది.ఈ మినీ పంప్ ద్వారా కేవలం 70 సెకన్లలోనే గాలి నింపుకోవచ్చు.మోటార్ సైకిళ్లతో పాటు భారీ వాహనాలకు కూడా గాలి నింపుకోవచ్చు.టైర్ పరిణామాన్ని బట్టి సమయం పడుతుంది.దీని ద్వారా ఫుట్ బాల్, బాస్కెట్ బాల్ బంతులకు కూడా గాలి నింపుకోవచ్చు.ఈ మినీ పంప్ ధర కేవలం 119 డాలర్లు మాత్రమే.అంటే ఇండియన్ కరెన్సీలో రూ.9899గా దొరుకుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube