పత్తి పంట( Cotton )ను రైతులు తెల్లబంగారంగా పరిగణిస్తారు.అంటే సరైన యాజమాన్య పద్ధతులు పాటించి, పంటను సాగు చేసి అధిక దిగుబడులు సాధిస్తే మంచి ఆదాయం పొందవచ్చు.
ఈ పత్తి పంటకు చీడపీడల, తెగుళ్ల బెడద కాస్త ఎక్కువే.సకాలంలో వీటిని గుర్తించి తొలిదశలో అరికడితే ఆశించిన మంచి దిగుబడులు పొందవచ్చు.
పత్తి పంటకు తీవ్ర నష్టం కలిగించే చీడపీడల( Pests ) విషయానికి వస్తే కత్తెర పురుగులు ఊహించని నష్టాన్ని కలిగిస్తాయి.ఈ పురుగులు ఆకుల అడుగు బాగాన గుడ్లు పెడతాయి.
చల్లని, వెచ్చని తేమతో కూడిన వాతావరణం ఈ పురుగుల వ్యాప్తికి అనుకూలంగా ఉంటుంది.ఈ పురుగులు పత్తి మొక్కల భాగాలను తినడం వల్ల ఊహించని నష్టం కలుగుతుంది.
ఆకు అంచులు చిరిగిపోవడంతో పాటు చివరికి ఆకులు రాలిపోతాయి.
ఈ పురుగుల ఉనికిని గుర్తించి వాటిని గుంపుగా పట్టుకోవడం కోసం అక్కడక్కడ లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలి.వీటి జనాభా అధికంగా పెరగకుండా ఉండాలంటే సీజన్ కంటే ముందే మొక్కలను నాటాలి.నష్టాన్ని తగ్గించడం కోసం పంటను త్వరగా కోయాలి.
సేంద్రీయ పద్ధతిలో( Organic Farming ) ఈ పురుగులను అరికట్టాలంటే.వేప సారం మొక్కలపై పిచికారి చేయాలి.
రసాయన పద్ధతిలో ఈ పురుగులను అరికట్టాలంటే.మాలథియాన్, లాంబా- సైహలోత్రిన్ లాంటి మందులను పిచికారీ చేసి ఈ పురుగులను అరికడితే మంచి దిగుబడి పొందవచ్చు.
పత్తి పంటకు వివిధ రకాల తెగుళ్లు లేదంటే చీడపీడలు( Pests ) ఆశిస్తే వ్యాప్తి అధికంగా ఉండకూడదు అంటే మొక్కల మధ్య, మొక్కల వరుసల మధ్య కాస్త అధిక దూరం ఉండేటట్లు నాటుకోవాలి.ఇలా నాటుకుంటే మొక్కలకు సూర్యరశ్మితో పాటుగాని బాగా తగిలి ఆరోగ్యకరంగా పెరుగుతాయి.