సర్వేల విశ్వసనీయత ఎంత?

ఒకప్పుడు మీడియా చానల్స్ నిర్వహించే సర్వేలు సామాన్య ప్రజానీకం అభిప్రాయాల పై తమ పట్టును చూపించుకోవడానికి ఒక వేదికగా మీడియా సంస్థల ఉపయోగించుకునేవి.ప్రజాభిప్రాయాలను శాంపిల్ రూపం లో తాము సమగ్రంగా పట్టుకోగలుగుతున్నామనడానికి తమ విశ్వసనీయత పెంచుకోవడానికి ఒక వేదికగా సర్వేలను మీడియా సంస్థలు చూసేవి .

 Times Now Survey Says Ycp Will Win With Huge Margin In Ap 2024 Elections Details-TeluguStop.com

అయితే కార్యక్రమంలో సర్వేల అర్థమే మారిపోయింది.తమకు అనుకూలంగా ఉన్నవారికి అనుకూలమైన రిపోర్టులు ఇవ్వడం కోసం మాత్రమే సర్వేలు చేస్తున్నాయి చాలా సంస్థలు.

ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన టైమ్స్ నౌ సర్వే( Times Now Survey ) విశ్వసనీయత కూడా ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది.ఆంధ్రాలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న అదికార వైసీపీకి( YCP ) మరొకసారి 99% ఎంపీ సీట్లు వస్తాయన్న టైమ్స్ నౌ సర్వే నివేదిక విశ్వసనీయత లేనిదని వార్తలు వస్తున్నాయి.

Telugu Ap, Cmjagan, Welfare Schemes, Times-Telugu Political News

ఏ ప్రభుత్వానికైనా రెండవసారి అధికారంలోకి రావడం అంత సులువు కాదు.ప్రభుత్వ వ్యతిరేకత అన్నది అత్యంత సహజమైన విషయం.ప్రజలు పెట్టుకున్న ఆశలను పూర్తిస్థాయిలో నెరవేర్చడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు కాబట్టి నామమాత్రపు స్థాయి నుంచి గణనీయమైన స్థాయిలోనే ప్రభుత్వ వ్యతిరేకత ఏ పార్టీ పైన అయినా ఉంటుంది.ఆంధ్రప్రదేశ్ లో కూడా సంక్షేమ పథకాల పరంగా సంతృప్తికర పరిపాలన చేస్తున్న వైసిపి మౌలిక సదుపాయాలను రాష్ట్ర అభివృద్ధి, ఉద్యోగాల కల్పన వంటి విషయాలలో వెనకబడిన విషయం తెలిసిందే.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో సరైన రోడ్లు లేకపోవడం ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచితే ,నిరుద్యోగిత శాతం భారీగా పెరగటం వ్యాపార అభివృద్ధి అవకాశాలు అడుగంటటం అర్బన్ ఓట్లలో ప్రభుత్వానికి వ్యతిరేకత తెచ్చిపెట్టింది

Telugu Ap, Cmjagan, Welfare Schemes, Times-Telugu Political News

ఇదంతా బహిరంగంగా సోషల్ మీడియా వేదికగా అనేకమంది వ్యక్తం చేస్తూ ఉండటం అంతేకాకుండా అనేక మీడియా ఇంటర్వ్యూలలో కూడా ప్రజల నుంచి ఆయా రకమైన వ్యతిరేక వాతావరణం కనిపించడం మనకు రోజువారి వ్యవహారాల్లో కనిపిస్తుంది.అయినప్పటికీ కూడా అంతా సక్రమంగానే ఉందని మరొక్కసారి 24 ఎంపీ స్థానాలను అధికార పార్టీ గెలుచుకుంటుందని సర్వే రిపోర్ట్ లో రావడం కేవలం ప్రభుత్వ మెప్పు పొందడం కోసం వారి నుంచి వచ్చే ఆర్థిక ప్రయోజనాల కోసమే టైమ్స్ లో ఈ విధంగా రిపోర్టు రిలీజ్ చేసిందని వార్తలు వస్తున్నాయి.మరి ఆర్థిక ప్రయోజనాల కోసం తమ విశ్వసనీయతను తామే దిగజార్చుకుంటున్న మీడియా వైఖరి ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube