పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( Prabhas ) బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వరుస ప్లాప్స్ అవుతున్న కూడా ప్రభాస్ చేస్తున్న సినిమాలపై ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకున్నారు.మరి ప్రభాస్ వరల్డ్ లెవల్లో చేస్తున్న మూవీ ”ప్రాజెక్ట్ కే” (Project K ).
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అప్డేట్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా నుండి తాజాగా మరో అప్డేట్ వైరల్ అయ్యింది.ఇప్పటికే పలు క్రేజీ పోస్టర్స్ తో పాటుగా ఇంట్రెస్టింగ్ మేకింగ్ వీడియోస్ కూడా రిలీజ్ చేసి ఈ సినిమాపై హైప్ పెంచేశారు.మరి ఇప్పుడు మరో అప్డేట్ తెలుస్తుంది.
ప్రాజెక్ట్ కే సినిమా ఇప్పటికే 75% పైగానే షూట్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.

ఒక వైపు షూట్ పూర్తి చేసుకుంటూనే మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఏకకాలం లోనే పూర్తి చేస్తున్నారు.మేకర్స్ పెట్టుకున్న టైం ప్రకారం ఈ సినిమా వీఎఫ్ఎక్స్ సహా మొత్తం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను అక్టోబర్ నాటికి పూర్తి చేయనున్నారట.ఇక షూట్ కూడా మూడు నాలుగు వారాల్లోనే పూర్తి చేసి మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పనుల మీదనే ద్రుష్టి పెట్టనున్నారు.

ఇలా నాగ్ అశ్విన్ ( Nag Ashwin ) అనుకున్న ప్లాన్ ప్రకారం సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయనున్నారు.ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు యూనిట్ సభ్యులు ప్రకటించారు.ఈ లోపు లోనే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసి సినిమాపై భారీ హైప్ పెంచనున్నారు.దీపికా పదుకొనె ( Deepika Padukone ), అమితాబ్ బచ్చన్ ( Amitabh Bachchan ) వంటి భారీ తారాగణం భాగం అయిన ఈ సినిమాను అశ్వనీదత్ 500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.







