2012 యుగాంతం గురించి ప్రజలు అంత త్వరగా మర్చిపోరు.అది యే రేంజులో జరిగిందో అందరికీ తెలిసినదే.
ఆ పుకారుని కొందరు తెలివైనవారు సినిమాలుగా మలిచి బాగా సొమ్ము కూడా చేసుకున్నారు.ఈ క్రమంలో కొంతమంది వ్యక్తులు విపత్తు సమయంలో తలదాచుకొనేలా బంకర్లను కూడా నిర్మించుకున్నారు.
తరువాత ఈ వార్త కేవలం పుకారు మాత్రమే అని నిరూపించబడింది.అయితే ప్రపంచం అంతం గురించి అనేక వాదనలు చేసేవారు ఇప్పటికీ ఉన్నారు.
ప్రస్తుతం అలాంటి వ్యక్తి చేసిన వాదన ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అవును, సరిగ్గా అంటే 4 ఏళ్ల తర్వాత అంటే 2027లో ప్రపంచంలో తాను తప్ప మరెవరూ మిగలరని ఓ వ్యక్తి పేర్కొన్నాడు.వాస్తవానికి వ్యక్తి తనను తాను టైమ్ ట్రావెలర్‌గా( Time Traveller ) కూడా చెప్పుకొని తిరుగుతున్నాడు మరి.అతను భవిష్యత్తుకి వెళ్లి.అక్కడ నుంచి తిరిగి వచ్చానని చెబుతున్నాడు.
మిర్రర్ నివేదిక ప్రకారం.వ్యక్తి 2027లో ప్రపంచం ఎలా ఉంటుందో చూసిన తర్వాత తిరిగి వచ్చానని చెప్పాడు.
అతను 2027 లోకి వెళ్ళినప్పుడు భూమిపై( Earth ) మనుషులు లేరని, ఎక్కడ చూసినా పెద్ద పెద్ద భవనాలు మాత్రమే కనిపించాయని చెప్పుకొచ్చాడు.
అంతేకాకుండా, ప్రపంచ ప్రసిద్ధి చెందిన కొలోస్సియంను కూడా చూసినట్లు అక్కడ ఒక్క మానవుడు కూడా కనిపించలేదని పేర్కొన్నాడు.నివేదికల ప్రకారం చూస్తే ఆ వ్యక్తి పేరు జేవియర్.( Javier ) తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల్లో అనేక వీడియోలు, చిత్రాలను కూడా ఈ సందర్బంగా విడుదల చేశాడు.
ఈ నేపధ్యంలోనే 2027లో భూమిపై మిగిలి ఉన్న ఏకైక మానవుడు తానేనని ఆయన పేర్కొన్నారు.అతను షేర్ చేసిన వీడియోలో మొత్తం నగరం చిత్రాన్ని చూపించాడు.
మొత్తం నగరం పూర్తిగా ఖాళీగా ఉంది.కార్లు, ఎత్తైన భవనాలు ఉన్నాయి, కానీ మనుషులు( Human Beings ) లేరు.
మనుష్యులందరూ అదృశ్యమైనట్లు కనిపించింది.తాను 2027 లో రోమ్ వీధుల్లో పగటిపూట తిరుగుతున్నానని, వీధులు పూర్తిగా ఖాళీగా కనిపించాయని జేవియర్ చెప్పాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy