యూకేలోని లీసెస్టర్‌షైర్‌లో జరిగిన హత్య కేసులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, టిక్‌టాకర్ మహేక్ బుఖారీ (24)( Social media personality Mahek Bukhari ) ఆమె తల్లి అన్‌స్రీన్ (46)లకు న్యాయమూర్తి జీవిత ఖైదు విధించారు.బాధితులు సాకిబ్ హుస్సేన్, హషీమ్ ఇజాజుద్దీన్ ఇద్దరికీ 21 ఏళ్లు ఉన్నాయి.
ఈ యువకులను మహేక్ మరో ఏడుగురి కలిసి అత్యంత వేగవంతమైన ఛేజింగ్‌లో చంపేసింది.ఈ నేరం వెనుక ప్రేమ, వ్యామోహం వంటివి కారణమని కోర్టు వెల్లడించింది.
అన్స్రీన్‌తో తన రొమాంటిక్ రిలేషన్‌ను బయటపెడతానని మృతుడు సాకిబ్ హుస్సేన్ బెదిరించడంతో వారిపై మహేక్ కక్ష పెంచుకుంది.

టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించాయని న్యాయమూర్తి తిమోతీ స్పెన్సర్ కెసి అన్నారు.ఈ మర్డర్స్‌కు కారణమైనందుకు మహేక్ బుఖారీకి కనీసం 31 ఏళ్ల ఎనిమిది నెలల జైలు శిక్ష, ఆమె తల్లి అన్రీన్( Ansreen Bukhari ) కనీసం 26 ఏళ్ల తొమ్మిది నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.కూతురు సోషల్ మీడియా మోజులో పడి యునివర్సిటీ మానేసినా తల్లి అన్రీన్ మందలించకపోవడం చాలా షాక్‌కి గురిచేస్తుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
తల్లి సరిగా కూతురిని పెంచలేదని చివరికి ఇద్దరి జీవితాలు జైలు పాలు అయ్యాయని కూడా పేర్కొన్నారు
ఇక ఈ మర్డర్ ఎలా చేశారంటే, టెస్కో కార్ పార్క్‌లోని సమావేశానికి తల్లీ-కూతురు ఇద్దరూ సాకిబ్ హుస్సేన్‌ను రప్పించారు.అక్కడ అన్రీన్ తమ రిలేషన్ సమయంలో సాకిబ్ తన కోసం వెచ్చించిన 3,000 పౌండ్లను తిరిగి ఇస్తానని హామీ ఇచ్చింది.
ఫిబ్రవరి 11న, డబ్బు తిరిగి ఇచ్చే నెపంతో లీసెస్టర్‌లో తనను కలవాలని సాకిబ్ హుస్సేన్( Saqib Hussain )ను మహేక్ ఆహ్వానించింది.ఆమె బాలాక్లావాస్ ధరించిన ఎనిమిది మంది వ్యక్తులతో వచ్చింది, వారిలో ఒకరు ఆయుధాలు కలిగి ఉన్నారు.
హుస్సేన్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని వారు అతడి పై దాడి చేయడం మొదలుపెట్టారు.

సాకిబ్ హుస్సేన్ సన్నిహిత మిత్రుడు హషీమ్ ఇజాజుద్దీన్( Mohammed Hashim Ijazuddin ) అతనితో కలిసి వచ్చాడు.అతడిపై కూడా వారు మెరుపుదాడికి పాల్పడ్డారు.ప్రాణాలను రక్షించుకునేందుకు బాధితులు స్కోడా ఫాబియాలో కారులో అక్కడి నుంచి త్వరగా పారిపోయారు.
వారిని మహేక్ బుఖారీ గ్రూప్ సీట్ లియోన్, ఆడి టిటి కార్లలో 145 కిమీ/గం వరకు ప్రమాదకరమైన అధిక వేగంతో వెంబడించారు.విషాదకరంగా, స్కోడా ఫాబియా చెట్టును ఢీకొట్టింది, మంటలు వ్యాపించాయి, ఫలితంగా ఇద్దరు యువకులు మరణించారు.
మరో ఇద్దరు నిందితులు రెకాన్ కార్వాన్ (29), రయీస్ జమాల్ (23) జంట హత్యలలో హస్తమున్నందుకు కనీసం 26 సంవత్సరాల 10 నెలలు, 31 సంవత్సరాల జైలు శిక్ష పాలయ్యారు.వారికి కూడా జైలు శిక్ష విధించారు.
ప్రాసిక్యూషన్ కేసులో కీలకమైన సాక్ష్యాల్లో సాకిబ్ హుస్సేన్‌పై దాడి చేయాలని మహేక్ పంపిన వాట్సాప్ మెసేజ్ కూడా ఉంది.ఈ తల్లీకూతుర్లు తమ కుమారులను నరక కొలిమిలో కాల్చడానికి వెంబడించారని బాధ్యత కుటుంబీకులు తీవ్ర వేదనను వ్యక్తం చేశారు.







