టిక్ టాక్ కీలక నిర్ణయం.. ఏకంగా 40 లక్షల వీడియోలు తొలగింపు..

మన దేశంలో ఎంతో ప్రజాదరణ పొందిన టిక్ టాక్‌ను( Tik Tok ) కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది.చైనా మూలాలు ఉన్నాయనే ఆరోపణలతో ఈ సోషల్ మీడియా యాప్‌పై వేటు వేసింది.

 Tik Tok Deleted 40 Lakh Videos Details, Social Media Application, Tik Tok Video,-TeluguStop.com

అయితే చాలా ప్రపంచ దేశాల్లో ఇది అమల్లో ఉంది.ఇక యూరప్ దేశాల్లో దీనిని వినియోగించే యూజర్లు అధిక సంఖ్యలో ఉన్నారు.

అయితే తమ దేశాల్లో సోషల్ మీడియా ప్లాట్ ఫారాలు, టెక్ దిగ్గజాల పట్ల కఠిన నిబంధనలను యూరోపియన్ యూనియన్( European Union ) అమలు చేస్తోంది.

డిజిటల్ సేవలపై కొత్త యూరోపియన్ చట్టం ప్రస్తుతం అమల్లో ఉంది.

దీనిని అనుసరించి టిక్ టాక్ కీలక నిర్ణయం తీసుకుంది.కేవలం ఒక నెలలో ఏకంగా 40 లక్షల వీడియోలను తొలగించింది.

అవి చట్టవిరుద్ధమైన లేదా హానికరమైనవిగా ప్రకటించింది.టిక్ టాక్ ఇటీవల మోడరేషన్ పాలసీకి సంబంధించి నివేదికను ప్రచురించింది.

అందులో ఈ విషయాన్ని వెల్లడించింది.

Telugu Byte Dance, European, Latest, Platm, Tech, Tik Tok-Latest News - Telugu

చైనీస్ కంపెనీ బైట్‌డాన్స్( Bytedance ) యాజమాన్యంలోని టిక్ టాక్ ప్లాట్‌ఫారమ్ ఉంది.ఈయూ నిబంధనలను అనుసరించి టిక్ టాక్ భారీగా వీడియోలను తొలగించింది.పెరిగిన పారదర్శకత దృష్ట్యా, అటువంటి నివేదికను ప్రతి ఆరునెలలకు ప్రచురించడం అనేది కొత్త యూరోపియన్ డిజిటల్ సర్వీసెస్ యాక్ట్‌లో( European Digital Service Act ) ఉంది.ఇది ఆగస్టు చివరి నుండి అమలులోకి వచ్చింది.ఈ నిర్ణయం టిక్ టాక్‌తో సహా 19 పెద్ద టెక్ ప్లాట్‌ఫారమ్‌లను ప్రభావితం చేస్తుంది.

Telugu Byte Dance, European, Latest, Platm, Tech, Tik Tok-Latest News - Telugu

యూరోపియన్ కమీషన్ ఎక్స్ (గతంలో ట్విట్టర్), మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్), టిక్‌టాక్‌లను లక్ష్యంగా చేసుకుని గత రెండు వారాల్లో పరిశోధనలు ప్రారంభించింది.ఇజ్రాయెల్‌పై హమాస్ దాడుల తర్వాత “తప్పుడు సమాచారం” మరియు “చట్టవిరుద్ధమైన కంటెంట్” వ్యాప్తికి వ్యతిరేకంగా వారు అమలు చేస్తున్న చర్యలపై టిక్ టాక్‌ను ఈయూ వివరణ కోరింది.ఇతర టెక్ ప్లాట్ ఫారాలకు భారీగా ఫైన్లు విధించింది.అయితే నిబంధనలను అనుసరించి ఆ ఫైన్ పడకుండా ముందే టిక్ టాక్ అప్రమత్తం అయింది.నిబంధనలను ఉల్లంఘించి పెట్టిన వీడియోలను తొలగించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube