ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా మోసాలు పెరిగిపోతున్నాయి.సామాన్యుల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ కూడా కేటుగాళ్ళ చేతిలో దారుణంగా మోసపోతున్నారు.
ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు ఆ విధంగా మోసపోయిన విషయం తెలిసిందే.తాజా కూడా ఒక బాలీవుడ్ స్టార్ హీరో తల్లి ఒక వ్యక్తి చేతిలో దాదాపు అరకోటి రూపాయలు మోసపోయింది.
అసలు ఆ బాలీవుడ్ హీరో తల్లి ఎవరు ఎవరి చేతుల్లో మోసపోయింది అసలు ఏం జరిగింది అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బాలీవుడ్ వెటరన్ స్టార్ హీరో జాకీ ష్రాఫ్( Jackie Shroff ) భార్య, టైగర్ ష్రాఫ్ తల్లి( Tiger Shroff ) అయేషా ష్రాఫ్‌ను( Ayesha Shroff ) అలెన్ ఫర్నాండో అనే వ్యక్తి రూ.58 లక్షలకు మోసం చేశాడు.ఈ మేరకు అయేషా ష్రాఫ్ ముంబై లోని శాంటాక్రజ్ పోలీస్ స్టేషన్ లో నిందితుడిపై ఫిర్యాదు చేసింది.
ఫెర్నాండెజ్ పై సెక్షన్ 420, 408, 465, 467, 468 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.నవంబర్ 20, 2018న MMA మ్యాట్రిక్స్ అనే జిమ్ కంపెనీని టైగర్ ష్రాఫ్ తన సోదరితో కలిసి స్టార్ట్ చేశాడు.
అయితే అక్కడ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా అలెన్ ఫర్నాండోను వారు నియమించారు.

టైగర్ ష్రాఫ్ సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్ల దాని బాధ్యతలను తల్లి అయేషా చూసుకుంటుంది.MMA మ్యాట్రిక్స్ ద్వారా పలు టోర్నమెంట్ లను నిర్వహించడం కోసం కొందరి నుంచి రూ.58 లక్షలు తీసుకున్నట్లు ఆమె ఆరోపించింది.అలెన్ ఫర్నాండోను ముంబై పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ విషయంపై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.కేవలం సామాన్యులకు మాత్రమే కాదు సెలబ్రిటీలకు కూడా ఇటువంటి బాధలు తప్పడం లేదు అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
