యూఎస్ ప్రీమియర్స్ కు రెడీ అయిన 'టైగర్'.. అనుకున్న రేంజ్ లో సక్సెస్ అయ్యేనా?

మాస్ మహారాజ రవితేజ( Ravi Teja ) మరో సినిమాతో దసరా బరిలో నిలవబోతున్నాడు.”టైగర్ నాగేశ్వరరావు”( Tiger Nageswara Rao ) అనే పాన్ ఇండియన్ సినిమాతో దసరా బరిలో నిలవబోతున్నాడు.నూతన డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రవితేజ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారడానికి సిద్ధం అవుతున్నాడు.ఈ సీజన్ లో భారీ పోటీ ఉన్నపటికీ వెనకడుగు వేయడం లేదు.

 Tiger Nageswara Rao Premiere Shows In Usa, Ravi Teja, Pan India Movie, Tiger N-TeluguStop.com

ఎందుకంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటుంది అనే ధీమా ఉండడంతో చిత్ర యూనిట్ మొత్తం కాన్ఫిడెంట్ గా ఉన్నారు.ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో అందరి కంటే ముందుగా ఉన్నారు.

వరుసగా అప్డేట్స్ ఇస్తూ ఆడియెన్స్ లో ఈ సినిమా పేరు నిత్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, రెండు సాంగ్స్, ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ రాగ మూడవ సాంగ్ ను ఈ రోజు రిలీజ్ చేయబోతున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేస్తూ రిలీజ్ కు సిద్ధం అవుతున్నారు.తాజాగా మేకర్స్ ఓవర్సీస్ రిలీజ్ గురించి అప్డేట్ ఇచ్చారు.

ఓవర్సీస్ లో ప్రీమియర్స్ గురించి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు.

టైగర్ ఇప్పుడు ప్రీమియర్స్ కు సిద్ధం అవుతున్నట్టు తెలిపారు.ఈ సినిమా అక్టోబర్ 20న ఇక్కడ గ్రాండ్ గా రిలీజ్ అవుతుండగా అక్టోబర్ 19నే యూఎస్ లో ప్రీమియర్స్ షురూ కానున్నాయి అని మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.మరి ఈ సినిమా అన్ని చోట్ల అనుకున్న స్థాయిలో రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.

ఇక ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్( Gayatri Bhardwaj ) హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ స్వరాలు అందిస్తుండగా అభిషేక్ అగర్వాల్ బ్యానర్ పై నిర్మించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube