తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం( Gopalapuram ) మండలంలో మరోసారి పెద్దపులి సంచారం తీవ్ర కలకలం చెలరేగింది.కోమటికుంట పొలాల్లో పెద్దపులి పాదముద్రలను స్థానిక రైతులు గుర్తించారు.
దీంతో రైతులు అటవీశాఖ అధికారులకు( Forest Department officials ) సమాచారం అందించారు.
అయితే పెద్దపులి సంచారం నేపథ్యంలో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.కాగా తాజాగా మండలంలోని చిట్యాల( Chityala )కు సమీపంలో ఉన్న ఫామాయిల్ తోటలో పులి పాదముద్రలను గుర్తించిన సంగతి తెలిసిందే.