తూర్పు గోదావరి జిల్లాలోని దేవరపల్లి మండలం( Devarapally )లో పెద్దపులి కలకలం చెలరేగింది.మండలంలోని బందపురంలో పులి సంచరిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.
దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.జీడీ తోటల్లో పులి పాదముద్రలు చూశామన్న రైతులు పొగాకు తోటల్లోనూ పెద్దపులి( Tiger ) సంచరిస్తుందని చెబుతున్నారు.
అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.రైతులు ఇచ్చిన సమాచారం మేరకు బందపురం చేరుకున్న ఫారెస్ట్ అధికారులు( Forest officials ) పులి జాడ కోసం గాలిస్తున్నారు.







