టైర్ 1 హీరోలు నెమ్మదిగా సినిమాలు చేస్తూ ఏడాదికి ఒక సినిమా చేస్తూ ఉంటారు.ఏడాదికి ఒక సినిమా చేస్తూ ఉంటారు.
కానీ టైర్ 2 హీరోలు అలా కాదు.వీరు ఏడాదికి రెండు నుండి మూడు సినిమాలు కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
కానీ కోవిద్ దీనిని పూర్తిగా మార్చేసింది.కోవిద్ తర్వాత చిన్న, మీడియా రేంజ్ హీరోలు మాత్రమే కాదు.
బడా హీరోలు కూడా వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు.
ఏ డైరెక్టర్ కథ చెప్పడానికి వెళ్లిన నచ్చితే వెంటనే లాక్ చేస్తున్నారు.
స్టార్ హీరోల నుండి టైర్ 2 హీరోల వరకు అందరి చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నాయి.సెట్స్ మీద ప్రాజెక్టులు ఉన్నప్పటికీ కొత్త డైరెక్టర్లు కొత్త కథలతో వస్తే వెంటనే ఓకే చెప్పేస్తున్నారు.
ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకు వెళుతున్నారు.ముఖ్యంగా టైర్ 2 హీరోలు కొత్త కథలను అస్సలు వదలడం లేదు.
ఛాన్స్ వస్తే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు.
న్యాచురల్ స్టార్ నాని ప్రెసెంట్ నటిస్తున్న ‘దసరా’ సినిమాను పాన్ ఇండియా వ్యాప్తంగా తెరకెక్కుతుంది.
ఈ సినిమాలో నానికి జోడీగా కీర్తి నటిస్తుంది.ఈ సినిమాలో నాని పక్కా తెలంగాణ యువకుడిగా ఊర మాస్ లుక్ లో కనిపించ బోతున్నాడు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కొత్త లైన్ తో తెరకెక్కుతుంది.ఈ సినిమా ఇప్పటికే షూట్ పూర్తి చేసుకుంది.
వచ్చే ఏడాది రిలీజ్ చేసే అవకాశం ఉంది.
ఈ సినిమా అయినా వెంటనే నాని శౌర్య అనే కొత్త దర్శకుడిని పరిచయం చేయబోతున్నారట.
ఇటీవలే శౌర్య నానికి కథ వినిపించగా ఓకే చెప్పినట్టు టాక్.ఈ సినిమాను చెరుకూరి మోహన్ నిర్మించే అవకాశం ఉందని సమాచారం.
ఇక నాగ చైతన్య తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తో ఒక సరికొత్త కథతో యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు.ఈ సినిమాలో కృతి శెట్టి చైతూకు జోడీగా నటిస్తుంది.
ఇక దీంతో పాటు చైతూ పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.

నితిన్ కూడా కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు.ఈయన ఇటీవలే మాచర్ల నియోజక వర్గం అనే సినిమాను చేసాడు.ఇక ఇప్పుడు వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.
అలాగే సురేందర్ రెడ్డి తో కూడా ఒక సినిమా చేయనున్నాడు.వీటితో పాటు భీష్మ డైరెక్టర్ వెంకీ తో కూడా చేసే అవకాశం ఉందట.
అలాగే శర్వానంద్ కూడా ఇటీవలే మంచి హిట్ అందుకున్నాడు.ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ కు ఓకే చెప్పినట్టు సమాచారం.డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య చెప్పిన కథకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.ఈయన లిస్టులో కృష్ణ చైతన్య కూడా ఉన్నాడు.
ఈయనతో సినిమాకు ఓకే చెప్పి మళ్ళీ మరో డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.