ఏపీ సీఎం వైఎస్ జగన్ వివిధ పథకాల ద్వారా రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తున్న సంగతి తెలిసిందే.కరోనా నేపథ్యంలో బయట ఉపాధి లేక అనేక అవస్థలు ఇతర రాష్ట్రాల్లో పడుతున్న గాని ఏపీలో పేదలకు సంక్షేమ పథకాల ద్వారా… ఆర్థికంగా వారిని ఆదుకుంటూ జగన్ అందిస్తున్న కార్యక్రమాలకు పేద వారి నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.ఇక ఇదే తరుణంలో పేద అగ్రవర్ణ మహిళలను కూడా అనుకునే రీతిలో నేడు వైఎస్సార్ ఈబిసి నేస్తం పథకం ద్వారా.3.92 లక్షల మంది లబ్ధిదారులకు 589 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది.
తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ విధానం లో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలో కి డబ్బులు జమ అయ్యేటట్లు ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో 45 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న అగ్రవర్ణ మహిళలకు. ఈ పథకం వర్తిస్తుంది అని స్పష్టం చేశారు.ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ తాము నెరవేరుస్తున్న ట్లు జగన్ తెలియజేశారు.
ఈ పథకం ద్వారా రెడ్డి, కమ్మ, ఆర్య వైశ్యులు, క్షత్రియులు మరియు వెలమ వర్గాలకు చెందిన పేద అగ్రవర్ణ మహిళలకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు.ఇప్పటికే మూడు సంవత్సరాలకు గానూ.15 వేల చొప్పున 45వేల సాయం చేస్తున్నట్లు జగన్ చెప్పుకొచ్చారు.అగ్రవర్ణ పేదలకు కూడా మంచి చేయాలనే ఉద్దేశంతోనే మేనిఫెస్టోలో చెప్పక పోయినప్పటికీ ఈబీసీ పథకం ద్వారా ఆదుకుంటున్నట్లు సీఎం జగన్ వ్యాఖ్యానించారు.