తెలంగాణ ఎలక్షన్స్( Telangana Elections ) హీట్ చివరి అంఖానికి చేరుకుంది.రేపటితో ఎన్నికలు కూడా పూర్తి కానున్నాయి.
ఇక డిసెంబర్ 3న వెలువడే ఫలితాలపైనే అందరూ దృష్టి నెలకొననుంది.ప్రస్తుతం అధికారం కోసం బిఆర్‌ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలు గట్టిగా పోటీ పడుతున్నాయి.
అయితే ఈ రెండు పార్టీలకు సంబంధించి రిజల్ట్స్ విషయాన్ని అటుంచితే.సిఎం ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది.
బిఆర్‌ఎస్ లో సిఎం అభ్యర్థిగా మరోసారి కేసిఆర్ ఉంటారని ఆ పార్టీ అగ్రనాయకులు ఇప్పటికే స్పష్టం చేశారు.దాంతో మూడోసారి కూడా కేసిఆరే సిఎం అనే నినాదంతో ఆ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది.

అయితే ఎలక్షన్స్ లో గెలిచిన తరువాత కేసిఆర్ కు బదులు కేటిఆర్( CM KCR ) సిఎం పదవి చేపట్టే అవకాశాలు ఉన్నాయనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తున్న చర్చ.ఎందుకంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేసిఆర్ జాతీయ రాజకీయాలవైపు గట్టిగా ఫోకస్ చేసే అవకాశం ఉంది.అందువల్ల రాష్ట్ర బాధ్యతలను కేటిఆర్ కు అప్పగించే అవకాశాలే ఎక్కువ అనేది కొందరి వాదన.అయితే కేసిఆరే సిఎం గా ఉంటారని కేటిఆర్ కుడా చాలా సార్లే స్పష్టం చేశారు.
మరి ఎలక్షన్స్ తరువాత నిర్ణయాల్లో మార్పులు ఉంటాయేమో చూడాలి.ఇక కాంగ్రెస్ విషయానికొస్తే ఆ పార్టీలో మొదటి నుంచి కూడా కుర్చీలాట గట్టిగానే జరుగుతోంది.
ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే సిఎం గా ఉండేందుకు దాదాపు అరడజన్ మంది పోటీ పడుతున్నారు.

వీరిలో సిఎం అభ్యర్థిని ఎన్నుకోవడం ఆ పార్టీ హైకమాండ్ కు కత్తిమీద సామే.ఎందుకంటే ఎవరో ఒకరిని సిఎం అభ్యర్థిగా ప్రకటించిన మిగిలిన వారి నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడే అవకాశాలు బలంగా ఉన్నాయి.తద్వారా పార్టీలో చీలిక ఏర్పడిన ఆశ్చర్యం లేదు.
ఈ నేపథ్యంలో సిఎం అభ్యర్థి విషయంలో ఏర్పడే సమస్యను అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.ఇక బీజేపీ విషయానికొస్తే ఆల్రెడీ బీసీ అభ్యర్థిని సిఎం చేస్తామని ప్రకటించడంతో ప్రధానంగా బండి సంజయ్ మరియు ఈటల రాజేందర్ పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి.
మరి ఈ ఇద్దరిలో బీజేపీ ఎవరివైపు మొగ్గు చూపుతుందనేధో చూడాలి.మొత్తానికి సిఎం పదవి విషయంలో మూడు ప్రధాన పార్టీల్లోనూ కన్ఫ్యూజన్ ఉందనేది స్పష్టంగా అర్థమౌతోంది.