మన జెండా పండుగకు అమెరికాలో అరుదైన గుర్తింపు.. ఏకంగా మూడు రాష్ట్రాలదీ ఒకే మాట..!!

75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సోమవారం భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు పెద్ద సంఖ్యలో వున్న దేశాల్లో ఘనంగా జరిగింది.ఈసారి ఇండియాతో సమానంగా అమెరికాలోనూ జెండా వందనం, హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు జరగడం విశేషం.

 Three American States Proclaim August 15 As India Independence Day , America, Am-TeluguStop.com

ఈ క్రమంలో అమెరికాలోని మూడు రాష్ట్రాలు ఆగస్ట్ 15ని భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవంగా ప్రకటించాయి.అవి మసాచుసెట్స్, రోడ్ ఐలాండ్, న్యూ హాంప్‌షైర్‌లు.

మసాచుసెట్స్ గవర్నర్ సి బేకర్ ఆగస్ట్ 15ని ఇండియా డేగా ప్రకటిస్తూ.స్వాతంత్య్రం సాధించిన ఈ 75 ఏళ్లలో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, సాంకేతిక రంగాల్లో భారత్ అనూహ్యమైన వృద్ధిని కనబరిచిందన్నారు.

రోడ్ ఐలాండ్ గవర్నర్ డేనియల్ మెక్కీ ఆగస్ట్ 15ని భారత స్వాతంత్య్ర దినోత్సవం గా ప్రకటించారు.ఈరోజు ప్రాముఖ్యతను గుర్తించడంలో తనతో పాటు నివాసితుందరినీ ఆయన ప్రోత్సహించారు.

భారతీయ వారసత్వం, సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు అనేక జీవిత సమస్యలకు పరిష్కారాలను అందిస్తాయని డేనియల్ ఒక ప్రకటనలో తెలిపారు.యో
గా, భారతీయ ప్రాచీన జ్ఞానం, బోధనలు మిలియన్ల మంది వ్యక్తులకు ప్రేరణ, ఆలోచనలనకు మూలంగా పనిచేస్తాయని ఆయన అన్నారు.

Telugu America, August, Daniel Mckee, India, Massachusetts, Hampshire, Rhode Isl

న్యూహాంప్‌షైర్ గవర్నర్ క్రిస్టోఫర్ టీ సునును మాట్లాడుతూ.భారత్ ఒక సమ్మిళిత నాగరికత అని.జాతి సమూహాలు, మతాలు, భాషలు, ఆచారాలు, సంప్రదాయాలు, దుస్తులు, మర్యాదలు, ఆహారపు అలవాట్లు, భిన్న వాతావరణ పరిస్ధితులు దేశాన్ని ఐక్యంగా వుంచుతున్నాయని చెప్పారు.అలాగే భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద డయాస్పోరాను కలిగి వుందన్న ఆయన.దాదాపు 32 మిలియన్ల మంది భారతీయులు వివిధ దేశాలలో నివసిస్తున్నారని క్రిస్టోఫర్ అన్నారు.5 మిలియన్లకు పైగా భారతీయ వలసదారులు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నివసిస్తున్నారని.వారు ఈ దేశ సామాజిక, ఆర్ధిక రంగాలకు దోహదపడుతున్నారని న్యూహాంప్‌షైర్ తన ప్రకటనలో తెలిపారు.అంతకుముందు ఈ నెల ప్రారంభంలో టెక్సాస్ గవర్నర్ సైతం భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఒక ప్రకటనను సైతం జారీ చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube