భారత్ జోడో యాత్ర చేపట్టిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెదిరింపు లేఖ వచ్చింది.మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో రాహుల్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే.
భారత్ జోడో యాత్ర అక్కడ జుని అనే ప్రాంతం మీదుగా కొనసాగాల్సి ఉంది.అయితే రాహుల్ పై బాంబు దాడి చేస్తామని బెదిరిస్తూ జుని ప్రాంతంలోని ఓ స్వీట్ షాపు వద్ద ఓ లేఖను కొందరు గుర్తు తెలియని దుండగులు వదిలి వెళ్లినట్లు సమాచారం.
రాహుల్ గాంధీతో పాటు మాజీ సీఎం కమల్ నాథ్ ను కూడా హతమార్చుతామని, పాదయాత్ర ఇండోర్ కు రాగానే బాంబు దాడులతో నగరం దద్దరిల్లిపోతుందని లేఖలో పేర్కొన్నారు.దీనిపై అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం ముందు జాగ్రత్తగా చర్యలకు సిద్ధమైయ్యారు.