కువైట్ లో భారత ఇంజనీర్ల పై వేటు..

ఒక్కో దేశం ఒక్కో రకంగా భారత్ పై కక్ష గట్టినట్టుగా అన్ని దేశాలు ఒకేసారి నిభంధనలని ఆయా దేశాలలో ఉంటున్న భారతీయ ఉద్యోగులపై అమలు చేస్తున్నాయి.ఎంతో కష్టపడే తత్వం అంతకంటే అధికమైన నైపుణ్యం కలిగిన భారత పౌరులని గతకొంతకాంగా అమెరికా ఎన్నో ఆంక్షలు పెట్టి వారిని స్వదేశానికి పంపాలని చూస్తోంది.

 Thousands Of Indian Kuwaiti Engineers Staring At Job Losses-TeluguStop.com

ఈ విధానాన్ని మొదట ట్రంప్ ప్రభుత్వం మొదలు పెట్టగా ఆ విధానాన్ని మళ్ళీ బ్రిటన్ ప్రభుత్వం అందుకుంది .వీసాలపై ఆంక్షలు విద్యార్ధిల పై ఆంక్షలు ఇలా బ్రిటన్ సైతం తన విధానాన్ని కొనసాగిస్తోంది.ఇదిలాఉంటే.తాజాగా కువైట్ ప్రభుత్వం కూడా వేలాది మంది భారతీయులపై పిడుగు వేసింది.

ఇకపై భారత నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిషన్ (ఎన్ బిఏ) గుర్తింపు పొందిన ఇంజనీరింగ్ డిగ్రీలు చేసినవారిని మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కువైట్ ప్రభుత్వం నిర్ణయించింది.దీంతో దశాబ్దాలుగా గల్ఫ్ దేశంలో ఉద్యోగాలు చేస్తున్న ఐఐటీ పట్టభద్రులతో సహా సుమారు 10,000 మందికి పైగా భారతీయ ఇంజనీర్లు ఉద్యోగాలు కోల్పోనున్నారు.ఇకపై తమ దేశానికి వలస వచ్చే ఇంజనీర్లు తప్పనిసరిగా కువైట్ ఇంజనీర్స్ సొసైటీ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికేట్ పొందితేనే వారికి వర్క్ పర్మిట్ ఇవ్వాలని గత మార్చిలో కువైట్ మానవ వనరుల శాఖ కార్మిక శాఖను ఆదేశించింది.

అయితే కువైట్ తీసుకున్న ఈ నిర్ణయంతో భారత దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐఎస్సీ బెంగళూరు, బిట్స్ పిలానీ, జాదవ్ పూర్ యూనివర్సిటీ, కలకత్తా యూనివర్సీటీలు ఇచ్చే బీటెక్ డిగ్రీలు ఏందుకు పనికి రావని అంటున్నారు పరిశీలకులు.

ఎందుకంటే ఈ సంస్థలు కొన్నాళ్ల క్రితం వరకు బీఎస్సీ చదివినవారికి మూడేళ్ల బీటెక్ డిగ్రీలు ఇస్తూ వచ్చాయి.ఇవేవీ తమ ఇంజనీరింగ్ కోర్సులకు ఎన్ బీఏ గుర్తింపు పొందలేదు.బిట్స్ పిలానీ, జేయూ నేషనల్ అసెస్ మెంట్ అండ్ అక్రెడిషన్ కౌన్సిల్ (ఎన్ఏఏసీ) గుర్తింపు పొందాయి.2010లో ఏర్పడిన ఎన్ బీఏ గుర్తింపు లేదని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన ప్రతిష్ఠాత్మక సంస్థల ఇంజనీరింగ్ డిగ్రీలు చెల్లబోవని కువైట్ ప్రభుత్వం ప్రకటించడంపై ఇప్పుడు ఎంతో మంది విద్యార్ధులు ఉద్యోగులలో ఆందోళన కలిగిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube