పాము భయం ఉన్నవారు మృత్తికా ప్రసాదం నుదిటిన పెట్టుకుంటే చాలు..!

సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయంలో స్వామివారి దర్శనం తరువాత భక్తులకు తీర్థ ప్రసాదాలను అందిస్తారు.

ఈ క్రమంలోనే కొన్ని ఆలయాల్లో నైవేద్యం ప్రసాదం పెడితే మరికొన్ని ఆలయాలు పండ్లను ప్రసాదంగా భక్తులకు సమర్పిస్తారు కానీ మీరు మట్టిని ప్రసాదంగా ఇచ్చే ఆలయం గురించి విన్నారా.

ఇలా మట్టి ప్రసాదంగా ఇచ్చే ఆలయం ఎక్కడ ఉంది.ఇలా ఆలయంలో ప్రసాదంగా ఇచ్చిన మట్టిని ఏం చేయాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Those Who Are Afraid Of Snakes Need To Put Clay Offerings On Their Foreheads, Sn

కర్నాటకలోని సుందరమయిన పశ్చిమ కనుమలలో కొలువై ఉన్న కుక్కే సుబ్రమణ్యస్వామి దేవాలయానికి వెళితే అక్కడ భక్తులకు పుట్టమట్టిని ప్రసాదంగా ఇస్తారు.దీనిని మృత్తికా ప్రసాదం అని కూడా పిలుస్తారు.

అయితే ఇలా ఇచ్చిన మట్టిని కొందరు తింటారు.ఇలా తినడం వల్ల మంచి జరుగుతుందని భావిస్తారు.

Advertisement

అయితే కొంతమంది ఈ మట్టిని తినడానికి అభ్యంతరం వ్యక్తం చేస్తుంటారు.అయితే ఈ విధమైనటువంటి మృత్తిక ప్రసాదాన్ని తినడానికి అభ్యంతరం వ్యక్తం చేసేవారు దీనిని ఎలా ఉపయోగించాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ముఖ్యంగా పాము భయం ఉన్నవాళ్ళు తరచూ కలలో పాములు వచ్చేవాళ్ళు మృత్తికా ప్రసాదాన్ని నుదుటి పై పెట్టుకుంటే పాము భయం తొలగిపోతుంది.ఇలా పాము భయం ఉన్న వారికి మృత్తిక ప్రసాదం మంచి పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది.

అదేవిధంగా పెళ్ళికాని అమ్మాయిలు లేదా అబ్బాయిలు పెళ్లిచూపులకి వెళ్తున్న సమయంలో వారు ఉదయం స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు, చిటికెడు ప్రసాదంగా ఇచ్చిన పుట్టమట్టిని కలిపి స్నానం చేసి నేతి దీపారాధన చేసి పెళ్లి చూపులకు బయలుదేరడం వల్ల పెళ్లి కుదురుతుందని పండితులు చెబుతున్నారు.

దర్శకుడిని ఓ రేంజిలో ఉతికారేసిన చంద్రమోహన్.. అసలు విషయం తెలిసి అవాక్కయ్యాడు..
Advertisement

తాజా వార్తలు