కేసీఆర్ కు ఇబ్బందిగా ఆ రెండు నియోజకవర్గాలు !

ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్ ( BRS party )మొదటి విడత అభ్యర్థుల జాబితా పై ఆ పార్టీ లో ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి.

అనేకమంది ఆశా వాహకులు తమ అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతూ విమర్శలు చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చాలావరకు మళ్ళీ అవకాశం కల్పించారు.అయితే కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించి మరొకరికి అవకాశం కల్పించారు.

ఈ నేపథ్యంలో జనగామ,  స్టేషన్ గన్ పూర్ నియోజకవర్గాలు కేసిఆర్ ( CM kcr )కు ఇబ్బందికరంగా మారాయి.జనగాం సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మళ్లీ టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు .ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి , పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ నియోజకవర్గ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.దీంతో జనగామ టికెట్ ను కెసిఆర్ పెండింగ్ లో పెట్టారు.

ఇక స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య( Tatikonda Rajaiah )ను తప్పించి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ని అభ్యర్థిగా ప్రకటించారు.దీంతో రాజయ్య తీవ్ర అసంతృప్తి గురయ్యారు.నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలను కలిసిన రాజయ్య తనకు టికెట్ దక్కకపోవడంతో కన్నీళ్లు పెట్టుకోవడం, అది మీడియా విస్తృతంగా ప్రచారం కావడంతో ఈ నియోజకవర్గంలో తాను కెసిఆర్ వెంటనే నడుస్తానని , ఆయన హామీలకు కట్టుబడి పని చేస్తానని ప్రకటించారు.

Advertisement

కానీ స్టేషన్ ఘన్ పూర్ టికెట్ లో కడియం శ్రీహరి నిర్వహించిన విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే రాజయ్య హాజరు కాకపోవడంతో రాజయ్య లో అసంతృప్తి  ఇంకా పోలేదు అనే విషయం అర్థం అవుతుంది.కడియం శ్రీహరి సభకు హాజరు కావాలని సంప్రదింపులు చేసేందుకు హన్మకొండలోని ఎమ్మెల్యే రాజయ్య ఇంటికి వెళ్లిన ఎమ్మెల్సీ  రాజేశ్వర్ రెడ్డి ( Palla rajeswar Reddy )ఆయన లేకపోవడంతో వెనుతిరిగారు.

రాజయ్య అనుచరులతో భేటీ అయ్యారు . రాజయ్య కు కీలక పదవి అప్పగించేందుకు కేసిఆర్ ప్లాన్ చేస్తున్నారని,  ఈ సందర్భంగా వారికి రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.ఇక జనగామ నియోజకవర్గంలో అభ్యర్థి విషయమై ఈరోజు కీలక ప్రకటన వెలువడనుంది.

మళ్లీ టికెట్ తనకే దక్కేలా  మంత్రి హరీష్ రావు ఎమ్మెల్సీ కవితలను కలిసిన ముత్తిరెడ్డి వారి ద్వారా కేసీఆర్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇక పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సైతం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు .జనగామ నియోజకవర్గానికి కేటాయించిన నిధులు,  పనులను వివరిస్తూ కేసీఆర్ ,కేటీఆర్ ఆశీస్సులతో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నానంటూ వీడియోను సైతం ఆయన విడుదల చేయడం హాట్ టాపిక్ గా మారింది.దీంతో ఈ రెండు నియోజకవర్గాల విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి ? ఈ రెండు నియోజకవర్గాల్లో అసంతృప్తులను ఏవిధంగా బుజ్జగించాలి అనే విషయంపైనే కేసీఆర్ దృష్టి సారించారట.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు