ఐపీఎల్ 2024 వేలంలో ఆ ముగ్గురే ఫ్రాంచైజీల టార్గెట్.. వేలం ఎప్పుడంటే..?

భారతదేశంలో ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ప్రస్తుతం అందరి దృష్టి ఐపిఎల్ 2024( IPL 2024 ) వేలంపై పడింది.

దుబాయ్ వేదికగా డిసెంబర్ 19వ తేదీ ఐపీఎల్ 2024 మినీ వేలం జరగనుంది.

ఐపీఎల్ లో పాల్గొనే జట్ల ఫ్రాంచైజీలు ఏ ఆటగాడిని వదిలించుకోవాలి.ఏ ఆటగాడిని అట్టి పెట్టుకోవాలి అనే విషయాలపై నవంబర్ 26 సాయంత్రం నాలుగు గంటలకు డెడ్ లైన్ ముగియనుంది.

డెడ్ లైన్ సమయం ముగిశాక ఫ్రాంచైజీలా రీ టెన్షన్ లిస్టు పై క్లారిటీ రానుంది.ప్రపంచవ్యాప్తంగా ఉండే బెస్ట్ క్రికెటర్లకు డిమాండ్ కూడా భారీగానే పెరిగింది.

ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2024 లో పాల్గొనే జట్లలో అనూహ్య మార్పులు, పలు సంచలనాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.ప్రస్తుతం ఐపీఎల్ లో పాల్గొన్న జట్ల ఫ్రాంచైజీలు ఏ ఆటగాళ్ల ను జట్టులో ఉంచుకోవాలి.

Advertisement

ఏ ఆటగాళ్లను తీసేయాలి.కొత్తగా ఏ ఆటగాడిని జట్టులోకి చేర్చుకోవాలి అనే విషయాలపై దృష్టి పెట్టాయి.

ఈ క్రమంలో గుజరాత్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా.ముంబై జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది.మరి హార్థిక్ పాండ్యా( Hardik pandya ) ముంబై జట్టులోకి వస్తే రోహిత్ శర్మ కెప్టెన్సీ ఉంటుందా లేదా అనే విషయంపై ఫ్యాన్స్ మధ్య చర్చ నడుస్తోంది.

ముంబై జట్టులో ఉండే జోప్రా అర్చర్ ను ఫ్రాంచైజీ తొలగించే అవకాశం ఉంది.పంజాబ్ జట్టు విషయానికి వస్తే.జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ తో పాటు సామ్ కరన్ కు ఫ్రాంచైజీ గుడ్ బై చెప్పనుందట.

చెన్నై జట్టు ఫ్రాంచైజీ బెన్ స్టొక్స్ కు గుడ్ బై చెప్పాలని అనుకుంటుంది.ఐపీఎల్ వేలం 2024లో ముగ్గురు ఆటగాళ్లను తమ జట్టులో చేర్చుకోవాలని ఫ్రాంచైజీ భావిస్తున్నాయి.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..

ఆ ఆటగాళ్లు మరెవరో కాదు.ఇటీవలే జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టు తరపున కీలక పాత్ర పోషించిన జట్టు ఓపెనర్ ట్రావిస్ హెడ్( Travis Head ), న్యూజిలాండ్ యంగ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర, దాదాపుగా 8 ఏళ్ల తర్వాత వేలానికి వస్తున్నా ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ మార్ష్.

Advertisement

ఈ ముగ్గురు ఆటగాళ్ల ను వేలంలో దక్కించుకొని జట్టులో చేర్చుకోవాలని అన్ని ఫ్రాంచైజీలు ఆరాటపడుతున్నాయి.

తాజా వార్తలు