నాన్న అమ్మ ఎక్కడ అంటూ అడిగిన నెటిజన్... దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చిన నాని?

నాచురల్ స్టార్ నాని( Nani )త్వరలోనే హాయ్ నాన్న (Hi Nanna) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.కొత్త దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో రాబోతున్నటువంటి ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీ విడుదల కానుంది.

 Nani Interesting Comments At Hi Nanna Trailer Launch Event Details, Nani, Mruna-TeluguStop.com

ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో నాని పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అయితే ఈసారి నాని కాస్త భిన్నంగా ఈ సినిమా ప్రమోషన్లను నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ లాంచ్ చేశారు.

ఈ ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటుంది.

Telugu Nani, Nanna, Nannatrailer, Mrunal Thakur, Nani Counter, Nani Fans, Nani N

ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ఆర్కే సినీప్లెక్స్‌లో నిర్వహించగా ఈ కార్యక్రమానికి నాని అభిమానులతో పాటు కొందరు కాలేజీ స్టూడెంట్స్ అలాగే మీడియా ప్రతినిధులు కూడా హాజరయ్యారు.ఇక ఈ ట్రైలర్ లాంచ్(Hi Nanna Trailer) కార్యక్రమం అనంతరం మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు కూడా చిత్ర బృందం సమాధానాలు చెప్పారు.ఇక ఈ ట్రైలర్ చూడడం పూర్తయిన తర్వాత ఆడియన్స్‌లో నుంచి ఒక వ్యక్తి.

నాన్నా అమ్మ ఎక్కడ అని అరిచాడు.అతడికి నాని మైక్ అందుకోగానే పంచ్ వేసేశారు.

Telugu Nani, Nanna, Nannatrailer, Mrunal Thakur, Nani Counter, Nani Fans, Nani N

ఇక ఈ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ ఈరోజు నాకు ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో లాగా అస్సలు లేదని ఒక కాలేజ్ ఈవెంట్ కు తాను వచ్చినట్టు ఉంది అంటూ నాని తెలియజేశారు.ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మీరంతా మమ్మల్ని ర్యాగింగ్ చేస్తున్నట్టు కూడా అనిపిస్తుందని ఈయన తెలియజేశారు.ఇందాక ఎవరో ఒకరు నాన్న అమ్మ ఎక్కడ అంటూ గట్టిగా అరిచారు.ఎవడ్రా వాడు అయినా మీ అమ్మ ఎక్కడుందో నాకు ఎలా తెలుస్తుంది రా బాబు వెళ్లి మీ నాన్నను అడుగు అంటూ అభిమానికి నాని దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు.

ఈ సినిమాలో నానికి జోడిగా మృణాల్ ఠాకూర్(Mrunal Thakur)నటిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube