యూట్యూబ్‌లో ఈ వీడియో అసలు చూడకండి.. లేదంటే మీ ఫోన్ రీబూట్ అవుతుంది!

సాధారణంగా యూట్యూబ్‌లో గానీ ఇంకా ఇతర ఏ సైట్‌లోనైనా వీడియోలు చూస్తే ఫోన్ అనేది రీబూట్ కావడం జరగదు.కానీ తాజాగా ఒక యూట్యూబ్ వీడియో మాత్రం ఫోన్లను రీబూట్ చేస్తోంది.

 This Youtube Video Causing Pixel 7 To Instantly Crash And Reboot Details, 4k Hdr-TeluguStop.com

ముఖ్యంగా పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో ఫోన్లను రీబూట్ చేయడం ఇప్పుడు వినియోగదారులకు ఆందోళన రేకెత్తిస్తోంది.యూట్యూబ్‌లో ఏలియన్స్ మూవీలోని ఒక 4K HDR వీడియో క్లిప్‌తో చూసినప్పుడే ఫోన్లు క్రాష్ అవుతున్నాయి.

ఈ వింత సాంకేతిక లోపం వల్ల ఈ వీడియో చూస్తున్నప్పుడు గూగుల్ పిక్సెల్ 7, 7 ప్రో డివైజ్‌లు క్రాష్ అవుతాయి.ప్లే చేయడానికి ప్రయత్నించినప్పుడు రీబూట్ అవుతాయి.

రెడిట్‌ థ్రెడ్‌లో ఈ సమస్య మొదటగా రిపోర్ట్ చేయడం జరిగింది.ఈ థ్రెడ్‌లో ఉన్న సమాచారం ప్రకారం కొన్ని పిక్సెల్ 6, 6a డివైజ్‌లు కూడా ప్రభావితమయ్యాయి.ఆండ్రాయిడ్ QPR బీటా, ఆండ్రాయిడ్ 14 డెవలపర్ ప్రివ్యూ 1ని అమలు చేస్తున్న డివైజ్‌లలో మాత్రం ఈ సమస్య కనిపించడం లేదు.కాగా మార్చి అప్‌డేట్‌లో ఈ సమస్య ఫిక్స్ చేస్తామని గూగుల్ హామీ ఇచ్చింది, అయితే ఈ సమస్యకు కారణం ఇంకా తెలియలేదు.

డివైజ్‌లు రీబూట్ అయిన తర్వాత, కొంతమంది యూజర్లు టెంపరరీగా సెల్యులార్ కనెక్టివిటీ సమస్యలను ఫేస్ చేసినట్లు తెలిపారు.లింక్‌పై క్లిక్ చేయడం లేదా యూట్యూబ్ యాప్‌లో వీడియోను ప్లే చేయడానికి ప్రయత్నించడం వల్ల డివైజ్‌ క్రాష్ కావచ్చని నిపుణులు చెబుతున్నారు.అయితే షియోమీ 13 ప్రో వంటి ఇతర పరికరాలు ప్రభావితం అయినట్లు కనిపించడం లేదు.కాబట్టి ఇతర ఫోన్ యూజర్లు కాకుండా కేవలం పిక్సెల్ ఫోన్ యూజర్లు సాంకేతిక సమస్యని ఫిక్స్ చేసేంత వరకు వీడియోను ప్లే చేయకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube