టాలీవుడ్ లో సాలిడ్ కలెక్షన్స్ సాధించిన సినిమా వచ్చి చాలా వారాలు అయింది.ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రతి సినిమా కూడా పేలని మిరపకాయ బాంబుల మాదిరిగా తుస్సు మంటున్నాయి.
ఆ మధ్య మంగళవారం( Mangalavaram Movie ) కాస్త పర్వాలేదు అనిపించినా కూడా లాంగ్ రన్ లో కలెక్షన్స్ అంతంత మాత్రమే అన్నట్లుగా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆ సినిమా కు ఫ్యామిలీ ఆడియన్స్ దూరంగా ఉన్న కారణంగా వసూళ్లు లేవు.
ఇక తాజా వారాల విషయానికి వస్తే ఏ ఒక్క సినిమా కూడా వావ్ అన్నట్లుగా అనిపించలేదు.ఇక నేడు ఆదికేశవ( Aadikeshava Movie ) సినిమా తో పాటు మరికొన్ని సినిమా లు కూడా విడుదల అవ్వబోతున్నాయి.

మెగా హీరో మూవీ ఆదికేశవ ను సితార ఎంటర్ టైన్మెంట్స్ వారు నిర్మించారు.అందుకే సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.ఇక సాలిడ్ వసూళ్లు ఆ సినిమా సాధిస్తుందా అనేది చూడాలి.మరో వైపు గీతా ఆర్ట్స్ వారు నిర్మించిన కోట బొమ్మాళి( Kotabommali Movie ) సినిమా కూడా నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఆ సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో చాలా నమ్మకం వ్యక్తం చేశారు.బన్నీ వాసు తప్పకుండా సినిమా మీ అందరికి నచ్చుతుంది అంటూ హామీ ఇచ్చాడు.

ఇక ఇతర సినిమా ల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.కనుక ఈ రెండు సినిమా లపైనే అందరి దృష్టి కేంద్రీకృతం అయి ఉంది.ఈ రెండు సినిమా లు మంచి టాక్ ను దక్కించుకుంటూ చాలా రోజులుగా మంచి సినిమా లు రాలేదు కనుక ఈ రెండు సినిమా లకి కూడా మంచి వసూళ్లు దక్కే అవకాశాలు ఉన్నాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ రెండు సినిమా ల్లో కూడా మంచి కమర్షియల్ పాయింట్స్ ను టచ్ చేశాం అంటూ మేకర్స్ చెబుతున్నారు.
మరి సినిమా లు ఏ మేరకు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తాయో చూడాలి.