సోషల్ మీడియాలో నిత్యం జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.ఇందులో ఎక్కువ శాతం సింహం, పులి ( Lion, Tiger )వేటలకు సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉంటాం.
అలాగే కొంతమంది ప్రజలు కొంతమంది వారు చేసే పిచ్చి పనుల వల్ల ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు కూడా చాలానే చూసాం.అచ్చం అలాంటి సంఘటన ఒకటి ముగ్గురు వ్యక్తులకు జరిగింది.
దాంతో వాళ్లకు చిరుత దాడిలో తీవ్ర గాయాలు పాలయ్యి చివరికి బయటపడ్డారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.
వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా.ఉత్తరప్రదేశ్ ( Uttar Pradesh )కు చెందిన 50 మంది మిత్రులు మధ్యప్రదేశ్ కు టూర్ కోసం వెళ్లారు.షాదోల్ జిల్లాలోని గోహ్పారు – జైత్ పూర్ ( Gohparu – Jaitpur )అడవుల్లోని వాటర్ ఫాల్స్ ను( Waterfalls ) వీక్షించేందుకు వెళ్లారు.కానీ, ఒక ముగ్గురు మాత్రం అడవి లోపలికి కాస్త వెళ్లి కొద్ది దూరంలో ఉన్న చిరుత పులిని చూశారు.
అక్కడితో భయపడి వెనక్కి రావాల్సింది పోయి.ఆ చిరుత పులిని వీడియోలు తీస్తూ, సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నాలు చేశారు.
కొంతమంది ఫ్రెండ్స్ దూరంగా ఉన్న ఫ్రెండ్స్ వెనక్కి రమ్మని అడిగా కానీ.వారు పట్టించుకోకుండా అలానే ఉండిపోయారు.
దాంతో చివరకు చిరుత దాడి చేసింది.ఆ ముగ్గురు వ్యక్తులు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసిన కానీ చిరుత వేగం ముందు వారికి అది సాధ్యపడలేదు.
చిరుత దాడిలో గాయపడిన వారిలో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ నితిన్ ( Assistant Sub Inspector Nitin )సమ్దరియా, 23 ఏళ్ల యువకుడు ఆకాష్ కుష్వాహా, 25 ఏళ్ల నందిని సింగ్ ఉన్నట్లు తెలుస్తుంది.ఈ దాడిలో భాగంగా మొదట ఆకాష్ మీద దాడి చేసి అతడి తొడను కొరికింది.అలాగే మరొక ఇద్దరికి స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది.ఫ్రెండ్స్ అందరూ ఒక్కసారిగా గట్టిగా అరవడంతో చిరుత పులి అక్కడి నుంచి అడవిలోకి పారిపోయింది.దీంతో క్షణకాలంలోనే ఆ ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు.వెంటనే స్నేహితులందరూ కూడా ఆ ముగ్గురిని సమీపంలోని హాస్పిటల్ లకు తరలించినట్లు సమాచారం.
ఇక ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.పులితో గేమ్స్ ఆడితే ఇలాగే ఉంటుందని కొందరు కామెంట్ చేస్తూ ఉంటే.
మరి కొందరు అయితే, పులిని తక్కువ అంచనా వేయకూడదు అని కామెంట్ చేస్తున్నారు.