ఈ రైలుకు కిటికీలు, తలుపులు ఉండవు.. ఎందుకంటే..?

ట్రైన్ అనగానే వాష్ రూమ్‌లు, కిటికీలు, తలుపులు అన్నీ ఉంటాయి.అలాగే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ప్లగ్ పాయింట్, ఫ్యాన్లు, లైట్లు ఆఫ్ చేసుకోవడానికి స్విచ్‌లు ఉంటాయి.

 This Train Has No Windows And Doors Because , This Train Has , Viral Latest, Ne-TeluguStop.com

దీంతో ట్రైన్‌లో ప్రయాణమంటే ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.అందుకే ట్రైన్‌లో ప్రయాణించడానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు.

ఇండియాలో రైల్వే నెట్ వర్క్( Railway network in India ) విస్తృతంగా ఉంది.ప్రతి పట్టణానికి కూడా రవాణా వ్యవస్థ ఉంది.

Telugu Doors, Windows, Train, Latest-Latest News - Telugu

ఇక ప్యాసింజర్ రైళ్లతో పాటు తక్కువ ఖర్చుతో సరుకు రవాణా చేసేందుకు గూడ్స్ రైళ్లను భారతీయ రైల్వే నడుపుతోంది.పెట్రోల్, డీజిల్ వంటి ముడి చమురుతో పాటు ఎన్నో వస్తువులను గూడ్స్ రైళ్లు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి డెలివరీ చేస్తాయి.ఇక రైల్వే నెట్ వర్క్ అనేది ఇండియాలో అభివృద్ధి చెందుతూనే ఉంది.ఇటీవల కొత్తగా స్వదేశీ టెక్నాలజీతో తయారుచేసిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను( Vande Bharat Express ) ప్రవేశపెట్టింది.

ఇవి కూడా బాగా పాపులర్ అవుతున్నాయి.

Telugu Doors, Windows, Train, Latest-Latest News - Telugu

ఇక ఎన్‌ఎంజీ రైళ్లను కూడా ఇండియన్ రైల్వే నడుపుతోంది.ఈ రైళ్లకు తలుపులు, కిటికీలు మూసేసి ఉంటాయి.ఇలాంటి రైళ్లను మీరు ఒకసారైనా చూసి ఉంటారు.

ఈ రైళ్లను చూస్తే మీకు అనేక అనుమానాలు వస్తాయి.కిటికీలు, తలుపులు ఎందుకు మూసేశారు.? లోపల ఏముంటాయి? అనే డౌట్ వస్తూ ఉంటుంది.ఈ రైళ్లకు కిటికీలు, తలుపులు మూసేయడానికి కారణం వాటిల్లో ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి సరుకు రవాణా చేస్తూ ఉంటారు.

ఎన్‌ఎంజీ( NMG ) అంటే న్యూ మాడిఫైడ్ గూడ్స్ అని అర్థం.ప్యాసింజర్ రైళ్లను గూడ్స్ రైళ్లుగా మార్చి సరుకు రవాణా కోసం ఉపయోగిస్తారు.ప్యాసింజర్ కోచ్‌ను ఎన్‌ఎంజీ కోచ్‌గా మార్చిన తర్వాత మరో 5 నుంచి 10 ఏళ్ల పాటు ఉపయోగిస్తారు.లోపల సీట్లు, ఫ్యాన్లు, లైట్లు అన్నీ తీసేసి ఈ కోచ్ లను తయారుచేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube