ఇన్ని రోజులు టీడీపీ అగ్రనాయకుడు యువనేత లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తారని అనుకున్నారంతా.గతంలో లోకేష్ కూడా ఇదే మాట చెప్పారు.
మంగళగిరి నుంచే పోటీ చేస్తానని అక్కడ పర్యటించిన సందర్బాల్లో తెలిపారు.అయితే ప్రస్తుతం మంగళగిరిలో జరుగుతున్న పరిణామాలతో లోకేష్ పోటీపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎందుకంటే మంగళగిరిలో బలమైన సామాజికవర్గంగా చేనేత కులస్తులు ఉన్నారు.మొత్తం రెండు లక్షలు దాటిన ఓట్లలో అత్యధిక శాతం వారి ఓట్లే ఉన్నాయి.
ఆ పార్టీ నుంచి 2014 ఎన్నికల్లో పోటీ చేసి తక్కువ ఓట్లతోనే ఓడిన గంజి చిరంజీవి టీడీపీకి రాజీనామా చేశారు.దీంతో వైసీపీ గంజి చిరంజీవిని ఇక్కడ నుంచి పోటీ చేపిస్తుందని వినిపిస్తోంది.
ఈ నేపథ్యలోనే లోకేష్ పోటీ చేయడం డౌటేనా.అంటున్నారు.
ఏ మాత్రం చిన్నపాటి డౌట్ ఉన్నా కూడా ఇక అక్కడ వద్దే వద్దు అని కూడా అనుకుంటోంది.అదే టైమ్ లో ఈసారి లోకేష్ ఎక్కడ పోటీ చేసినా కచ్చితంగా బంపర్ మెజారిటీతో గెలిచి తీరాలని కూడా భావిస్తోంది.
టికెట్ ఇవ్వాల్సింది చంద్రబాబే…

కాగా లోకేష్ 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేశారు.కాగా ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామక్రిష్ణ రెడ్డి చేతిలో 5300 ఓట్ల తేడాతో ఓడిపోయారు.ఇక నారా లోకేష్ ఈసారి గెలుపు ఖాయమని బరిలోకి దిగుతున్న వేళ గంజి చిరంజీవి కనుక వైసీపీ అభ్యర్ధిగా బరిలోకి వస్తే ఇబ్బందే అని కూడా అంటున్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో కచ్చితంగా మంగళగిరి నుంచే పోటీ చేసి ఈసారి బంపర్ విక్టరీ కొడతాను అని ఇప్పటిదాకా చాలెంజ్ చేసినప్పటికీ పస్తుత పరిస్థితులతో లోకేష్ బాబు తాజాగా మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ తనకు కూడా టికెట్ ఇవ్వాల్సింది చంద్రబాబే అని తేల్చేశారు.
తాను మంగళగిరిలో పోటీ చేయాలని అనుకుంటున్నాను అని.అయితే తన అభ్యర్థిత్వం మీద కూడా సర్వే చేసిన మీదటనే టికెట్ ఇస్తారని చెప్పడం కొత్త అనుమానాలకు తావిస్తోంది.ఇప్పటిదాకా ఆ మాట మాట్లాడని లోకేష్ ఇపుడు ఇలా అనడమేంటి అన్న డౌట్లు వస్తున్నాయి.

మంగళగిరిలో గంజి చిరంజీవి టీడీపీకి రాజీనామా చేసిన రోజే లోకేష్ తాజా రాజకీయ పరిణామాలను బేరీజు వేసుకునే ఇలా మాట్లాడి ఉంటారా అన్న చర్చ కూడా సాగుతోంది.గతంలో మాదిరిగా ఆయన ఇక్కడ నుంచే పోటీకి దిగుతాను అని గట్టిగా చెప్పలేకపోవడం మీద కూడా చర్చ సాగుతోంది.మరి లోకేష్ మంగళగిరి నుంచే బరిలోకి దిగుతారా లేక మరో చోట నుంచి బరిలోకి దిగుతారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఇక లోకేష్ పోటీ చేస్తే కనుక గంజి చిరంజీవినే వైసీపీ తమ అభ్యర్థిగా బరిలోకి దింపాలని చూస్తోందట.అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే అళ్ల రామక్రిష్ణారెడ్డికి ఈసారి టికెట్ దక్కదని చెబుతున్నారు.
ఆయన జగన్ కి అత్యంత సన్నిహితుడు అయినప్పటికీ ఇక్కడ బీసీ కార్డు వాడాలని చూస్తోందట.