ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఎదుగుదలలో తల్లి వైఎస్.విజయలక్ష్మితో పాటు సోదరి వైఎస్.
షర్మిల పడిన కష్టం అంతా ఇంతా కాదు.జగన్ జైలులో ఉన్నప్పుడు విజయలక్ష్మి, షర్మిల 2012 ఎన్నికల్లో నాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి ఉప ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించడంలో తమ వంతు కృషి చేశారు.
ఇక షర్మిల ఏకంగా ఓ మహిళగా ఉండి 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి తెలుగు రాజకీయాల్లోనే సంచలనం క్రియేట్ చేశారు.నిజంగా అన్నకోసం షర్మిల పడిన కష్టానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే.
అంతగా పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో వాళ్లు పడిన కష్టం అంతా ఇంతా కాదు.
ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో జగన్ తన తల్లి విజయలక్ష్మిని విశాఖ ఎంపీ బరిలోకి దించగా ఆమె నాటి బీజేపీ అభ్యర్థి కంభంపాటి హరిబాబు చేతిలో ఓడిపోయారు.
ఆ ఎన్నికల్లోనే షర్మిలను తెలంగాణలోని ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేయిస్తారన్న ప్రచారం జరిగినా కుదర్లేదు.ఇక గత ఎన్నికల్లోనూ షర్మిలను ఒంగోలు బరిలో ఎంపీగా పోటీ చేయిస్తారని వైసీపీ వర్గాల్లోనే ప్రచారం జరిగింది.
వాస్తవానికి షర్మిల కడప ఎంపీ సీటుపై మక్కువ పెంచుకున్నా జగన్ మాత్రం ఆ సీటును గత రెండు సార్లు తన కజిన్ అయిన వైఎస్.అవినాష్ రెడ్డికి కేటాయించారు.

ఇక ఏపీలో ఇప్పుడు వైసీపీలో అధికారంలో ఉంది.పార్టీ సంస్థాగతంగా తిరుగులేకుండా ఉంది.ఈ క్రమంలోనే షర్మిలను వచ్చే ఎన్నికల్లో ఎంపీ బరిలోకి దించాలని జగన్ డిసైడ్ అయినట్టు వైసీపీలో ప్రచారం జరుగుతోంది.తన తల్లి విజయలక్ష్మి ఓడిన విశాఖ ఎంపీ బరిలోనే షర్మిలను రంగంలోకి దించే ఆలోచనలో ఉన్నారట.
విశాఖను జగన్ పరిపాలనా రాజధానిగా చేయడంతో అక్కడ వైసీపీ గ్రాఫ్ మామూలుగా లేదు.ఇక అక్కడ ప్రస్తుత ఎంపీ ఎంవీవీ. సత్యనారాయణపై ప్రజల్లో ఏ మాత్రం సదభిప్రాయం లేదు.
ఆయన ఎన్నికలకు ముందే పార్టీలోకి వచ్చి ఎంపీ అయ్యారు.
పార్టీకి ఆయన వల్ల ఒరిగింది లేదు.ఇక ఆయన టీడీపీ నేతలతో పాటు బీజేపీ వాళ్లతోనే ఎక్కువ సంబంధాలు ఉన్నాయి.
ఇక విజయసాయి డామినేషన్ వల్ల సత్యనారాయణ ఆగ్రహంతో రగులుతున్నారు.అసలు కీలకమైన విశాఖకు ఆయన ఎంపీగా ఉన్నా.
ఆయన్ను పట్టించుకునే వాళ్లే లేరు.ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు ఇవ్వరని.
అక్కడ నుంచి షర్మిలకు సీటు ఫిక్స్ అయినట్టే అని వైసీపీ వర్గాల టాక్ ?
.