ఏపీ రాజకీయాల్లో ఆర్యవైశ్యులు నిలదిక్కుకున్న వారు అనేకమంది ఉన్నారు.బలమైన ఆర్థికవర్గంగా, రాజీకాయాల్లో పుంజుకున్న వర్గంగా వారికి పేరుంది.
రాష్ట్రంలో 12శాతం మంది ఆర్యవైశ్యులు ఉన్నారు.విజయవాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి తదితర జిల్లాల్లో వైశ్య సామాజికవర్గానికి బలమైన ఓటుబ్యాంకు ఉంది.
అందుకే అన్ని పార్టీలు కూడా వారికి అధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చాయి.వస్తూ ఉన్నాయి.
ఇది అందరికి తెలిసిన విషయమే.ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో ముగ్గురు వైశ్యకుటుంబానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు.
అయితే త్వరలో చేపట్టబోయే మంత్రి వర్గ విస్తరణలో వారికి ఈ సారీ .అవకాశం లభించేలా లేదని టాక్.

ప్రస్తుతం దేవదాయ శాఖ మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస్ కొనసాగుతున్నారు.ఈయనను మంత్రివర్గం నుంచి తప్పించాలని యోచిస్తున్నారట.దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం తదితర విషయాల్లో వెల్లంపల్లి అనేక విమర్శలు మూటగట్టుకున్నారు.అయినా వాటిని ఆయన అంతగాఇ పట్టించుకోలేదు.ఈక్రమంలో ఉగాది నాటికి చేపట్టే మంత్రి వర్గంలో వైశ్య సామాజిక వర్గానికి ప్రాధాన్యం లేదని సమాచారం.దీనికి ఓ కారణమూ ఉంది.
ఇప్పటి వరకుమరో అగ్రవర్ణం బ్రాహ్మణులకు మంత్రివర్గంలో చోటు లభించలేదు.నెక్స్ట వీరికి ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారట.
ఈ విషయంలో విజయవాడ, గుంటూరు జిల్లాలకు చెందిన బ్రాహ్మణ నేతలు సైతం పోటీపడుతున్నారట. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మొత్తంగా మంత్రి వర్గ విస్తరణ బాధ్యతలు కీలక నేత, ప్రముఖ ఆడిటర్ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించినట్టు తెలిసింది.త్వరలోనే వీరు రంగంలోకి దిగి తమదైన శైలిలో కసరత్తు చేయనున్నారు.
ఎవరిని తీసుకోవాలి ? ఎవరిని తప్పించాలి ? అనేది వారే తేల్చనున్నట్టు సమాచారం.తుడి నిర్ణయం మాత్రం సీఎం జగన్‌దేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
వారి లెక్కల్లో ఎవరున్నారు ? ఎవరు లేరనేది తెలియాలంటే ఉగాది వరకు వేచి చూడాల్సిందే.







