ఈ పరిస్థితి పగోడికైనా రాకూడదు.. ఆమె నవ్వినా, ఏడ్చినా.. చనిపోతుంది!

అవును, ఈ పరిస్థితి పగోడికైనా రాకూడదు.ఆమె ఓ అరుదైన వ్యాధితో బాధపడుతోంది.

 This Situation Should Not Come To Pagoda  Whether She Laughs Or Cries She Will D-TeluguStop.com

మనలో చాలా మందికి ఎలర్జీలు వస్తుంటాయి.కానీ కాలిఫోర్నియాకు చెందిన టెస్సా హాన్సెన్ స్మిత్ ది చాలా వింతైన ఎలర్జీ.

అదేమిటంటే ఆమెకు ‘వాటర్ అలర్జీ’ వుంది.ఆమె ఒంటిపై చిన్న నీటి చుక్క పడినా శరీరం అంతా బొబ్బలు వచ్చేస్తాయి.

పొరపాటున ఆమెపై నీటి చుక్క పడినట్లైతే ఇక యాసిడ్ పడినట్లే.ఎంతలా అంటే ఆమె నవ్వకూడదు.

అలాగే ఏడవకూడదు కూడా.ఎందుకంటే కన్నీరు పడిన చోట ఎర్రగా బొబ్బలొచ్చాస్తాయి కాబట్టి.

అలాగే ఆమె చెమటపట్టకూడదు కూడా.ఇక స్నానం సంగతైతే మర్చిపోవాల్సిందే.

ఆమె హిస్టరీ చూసినట్లేతే, 21వ సంవత్సరాల వయస్సు ఉన్న టెస్సాకు 10 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ‘వాటర్ అలర్జీ’ ఉన్నట్లుగా ఆమె తల్లిదండ్రులు గుర్తించారు.టెస్సా తల్లిదండ్రులిద్దరు డాక్టర్లు కావడం ఇక్కడ కొసమెరుపు.

టెస్సాకు 10 ఏళ్ల వయస్సు వున్నపుడు శరీరం అంతా అలర్జీ వస్తే.బహుశా షాంపూలు.

సబ్బుల వల్ల ఇలా వస్తోందేమోననుకున్నారు.తరువాత పెద్దగా ఆమె శరీరంలో మార్పు రాకపోవడంతో ఎన్నో టెస్టులు చేసిన తరువాత టెస్సాకు ‘ఆక్వాజెనిక్ ఆర్టికేరియా’ఉందని తెలుసుకుని షాకయ్యారు.

ఇదొక అరుదైన వ్యాధి.ప్రపంచంలో ఇలాంటి సమస్య దాదాపు ఎవరికీ ఉండదు.మహా కాకపోతే 100 కంటే తక్కువ మందికి మాత్రమే ఈ అలర్జీ ఉందట.ఇక ఈ అలర్జీపై పోరాడేందుకు టెస్సా రోజుకు 9 రకాల టాబ్ లెట్స్ వేసుకుంటుంది.

చెమటపడుతుందనే భయంతో 10 ఏళ్ల నాటి నుంచి ఆటలకు కూడా దూరంగా ఉంది.ఎక్కువగా నడవడానికి కూడా టెస్సా భయపడుతుంది.

ఎందుకంటే చెమట పట్టి సమస్య వస్తుందని.అందుకే ఆమె చిన్ననాటి నుంచి కారులోనే తిరుగుతోంది.

ఈ అలర్జీ వల్ల టెస్సా నెలకు కేవలం 2 సార్లే స్నానం చేసే సాహసం చేస్తుంది.ఇక ఇలాంటి సమస్యలు పగవాడికి కూడా రాకూడదని ఆ తల్లిదండ్రులు మొక్కుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube