ఈ సలాడ్ డైట్ లో ఉంటే చాలు.. వెయిట్ లాస్ తో సహా ఎన్నో బెనిఫిట్స్ మీ సొంతం!

ప్రస్తుత రోజుల్లో అధిక బరువు అనేది దాదాపు అందరికీ అతి పెద్ద శత్రువు గా మారింది.

ఈ క్రమంలోనే పెరిగిన బరువును కరిగించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.

అయితే శరీర బరువును తగ్గించడానికి కొన్ని కొన్ని ఆహారాలు ఎంతో అద్భుతంగా సహాయపడతాయి.అటువంటి ఆహారాల్లో ఇప్పుడు చెప్పబోయే సలాడ్ ఒకటి.

ఈ సలాడ్ ను డైట్ లో చేర్చుకుంటే చాలు వెయిట్ లాస్ తో సహా ఎన్నో అమోఘమైన బెనిఫిట్స్ తమ సొంతం చేసుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సలాడ్ ఏంటో.

దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.తెలుసుకుందాం పదండి.

Advertisement
This Salad Add In Your Diet, You Will Get Many Benefits Including Weight Loss! W

ముందుగా ఒక కప్పు పెసలు నానబెట్టుకుని స్ప్రౌట్స్ తయారు చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు స్ప్రౌట్స్ వేసుకోవాలి.

అలాగే అర కప్పు క్యారెట్ ముక్కలు, అర కప్పు తొక్క తొలగించిన కీర ముక్కలు, అర కప్పు క్యారెట్ ముక్కలు, అర క‌ప్పు టమాటో ముక్కలు, ఒక కప్పు దానిమ్మ గింజలు వేసుకోవాలి.

This Salad Add In Your Diet, You Will Get Many Benefits Including Weight Loss W

అలాగే రుచికి సరిపడా బ్లాక్ సాల్ట్, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, చిటికెడు ఇంగువ, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్‌, రెండు టేబుల్ స్పూన్లు తరిగిన కొత్తిమీర వేసి బాగా కలిపితే మన సలాడ్ సిద్ధమవుతుంది.ఈ సలాడ్ రుచిగా ఉండడమే కాదు ఆరోగ్యానికి సైతం ఎంతో మేలు చేస్తుంది.ఈ సలాడ్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల అతి ఆకలి దూరం అవుతుంది.

మెటబాలిజం రేటు పెరుగుతుంది.దాంతో క్యాలరీలు చాలా త్వరగా కరుగుతాయి.

న్యూస్ రౌండప్ టాప్ 20

ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.

This Salad Add In Your Diet, You Will Get Many Benefits Including Weight Loss W
Advertisement

అలాగే ఈ సలాడ్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది.మెదడు సూపర్ షార్ప్ గా పనిచేస్తుంది.

శరీరానికి అవసరం అయ్యే ప్రోటీన్ లభిస్తుంది.నీరసం అలసట వంటివి తరచూ వేధించకుండా ఉంటాయి.

వృద్ధాప్య లక్షణాలు త్వరగా దరిచేరకుండా ఉంటాయి.జుట్టు రాలడం, చిట్లడం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.

కురులు ఒత్తుగా పొడుగ్గా సైతం పెరుగుతాయి.

తాజా వార్తలు