జుట్టు సమస్యలన్నిటికీ చెక్ పెట్టే మునగాకు షాంపూ.. ఇంతకీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?

మునగాకు( Drumstick leaves ) ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా వివరించే చెప్పక్కర్లేదు.మునగాకులో పోషకాలు మరియు ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి.

అందువల్ల ఆరోగ్యపరంగా మనకు మునగాకు అనేక విధాలుగా సహాయపడుతుంది.అయితే జుట్టు సమస్యలకు సైతం మునగాకు చెక్‌ పెట్టగలదు.

ముఖ్యంగా మునగాకుతో షాంపూ తయారు చేసుకుని వాడారంటే మీ జుట్టు సమస్యలన్నీ పరార్ అవ్వడం ఖాయం.మరి ఇంతకీ మునగాకుతో షాంపూ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

This Moringa Shampoo Helps To Get Rid Of All Hair Problems Hair Problems, Morin

ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో మూడు టేబుల్ స్పూన్లు మునగాకు పొడి, మూడు టేబుల్ స్పూన్లు సోప్ నట్స్(కుంకుడుకాయ)( Soap Nuts ) పొడి మరియు రెండు టేబుల్ స్పూన్లు మందారం పొడి వేసుకోవాలి.ఆపై గరిటెతో బాగా కలుపుతూ ఉడికించాలి.

Advertisement
This Moringa Shampoo Helps To Get Rid Of All Hair Problems! Hair Problems, Morin

దాదాపు పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ పూర్తిగా చల్లారిన తర్వాత రెండు మూడు చుక్కలు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్( Tea Tree Essential Oil ) వేసుకొని బాగా మిక్స్ చేస్తే మన మునగాకు షాంపూ అనేది సిద్ధం అవుతుంది.

This Moringa Shampoo Helps To Get Rid Of All Hair Problems Hair Problems, Morin

ఈ షాంపూను ఒక బాటిల్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.ఈ షాంపూను ఉపయోగించి ప్రతి వారం హెయిర్ వాష్ చేసుకుంటే అద్భుత లాభాలు పొందుతారు.ఈ మునగాకు షాంపూ జుట్టును ఆరోగ్యంగా మారుస్తుంది.

ఒత్తుగా పొడుగ్గా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.అలాగే కూతుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని అడ్డుకుంటుంది.

న్యూస్ రౌండప్ టాప్ 20

వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ మునగాకు షాంపూను కనుక వాడితే చుండ్రు సమస్య పరారవుతుంది.తలలో దురద, ఇతర ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉంటే నయం అవుతాయి.

Advertisement

జుట్టు చిట్లడం, విరగడం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.పైగా ఈ షాంపూను వాడటం వల్ల తెల్ల జుట్టు సైతం త్వరగా దరిచేరకుండా ఉంటుంది.

కాబట్టి ఆరోగ్యమైన ఒత్తైన నల్లటి కురులను కోరుకునేవారు తప్పకుండా ఈ మునగాకు షాంపూను వాడేందుకు ప్రయత్నించండి.

తాజా వార్తలు