ఈ కోతి కూర‌గాయల వ్యాపారం మామూలుగా లేదుగా..

ఈ మ‌ధ్య కోతులు చాలా తెలివి మీరిపోతున్నాయండోయ్‌.అవి ఏం చేస్తున్నాయో చూస్తే మ‌న కండ్ల‌ను మ‌న‌మే న‌మ్మ‌లేకుండా పోతున్నాం.

ఎందుకంటే అవి ఇలా కూడా చేస్తాయా అని అనిపించ‌క మాన‌దేమో.చాలా వ‌ర‌కు కోతులు అన‌గానే అవి అల్లరి చేసే జంతువులుగానే మ‌న‌కు తెలుసు.

మ‌న ఇంట్లో ఎవ‌రైనా చిన్న పిల్ల‌లు చిల్ల‌ర వేషాలు వేస్తే కోతి ప‌నులు అని కోప్ప‌డుతుంటాం.కానీ కోతులు మాత్రం మ‌నుషుల మ‌ధ్య ఉంటూ చాలా తెలివి తెచ్చుకుంటున్నాయి.

మొన్న‌టికి మొన్న ఓ కోతి చీర క‌ట్టుకుని మురిసిపోవ‌డం కూడా చూశాం.అలాగే మ‌రో కోతి స్మార్ట్ ఫోన్ ప‌ట్టుకుని వీడియోలు చూస్తున్న ఘ‌ట‌న కూడా చూశాం.

Advertisement

ఇలా కోతులు మ‌నుషులు వాడుతున్న వ‌స్తువుల‌తో ఎన్నో ఫీట్లు చేస్తున్నాయి.కాగా ఇవ‌న్నీ స‌రిపోవ‌నుకుందో ఏమో గానీ.

ఓ వాన‌రం మాత్రం చాలా విభిన్నంగా ఆలోచించింది.వెంట‌నే కూర‌గాయ‌ల బిజినెస్ చేస్తోంది.

అదేంటి కోతి కూర‌గాయ‌లు క‌నిపిస్తే తినేస్తుంది కానీ బిజినెస్ చేస్తుందా అని షాక్ అవ్వ‌కండి.కానీ మీరు విన్న‌ది నిజ‌మేనండోయ్‌.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో బాగా వైర‌ల్ అవుతోంది.మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

ఈ వైర‌ల్ వీడియోలో ఓ కోతి కూరగాయల కొట్టు వ‌ద్దుకు వ‌చ్చి కూర్చున్న‌ట్టు క‌నిపిస్తుంది.అక్క‌డ ఎవ‌రూ లేక‌పోవ‌డంతో అమ్మ‌కం దారులు కూర్చునే సీట్లో కూర్చుని తానేదో కూర‌గాయ‌లు అమ్ముతున్న‌ట్టు ఉంది.అయితే ప‌నిలో ప‌ని కూర‌గాయ‌లు తింటూ ఎవ‌రైనా వ‌స్తున్నారో లేదో అని చూస్తూ ఉంటుంది.

Advertisement

ఇందుకు సంబంధించిన ఘ‌ట‌న‌ను మొత్తం అక్క‌డున్న వారు వీడియో తీసి నెట్టింట్లో షేర్ చేయ‌గా విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.కోతి బుద్ధిగా బిజినెస్ చేసుకుంటోందని కొంద‌రు కామెంట్లు పెడుతుంటే.

మ‌రికొంద‌రు మాత్రం కోతి సూప‌ర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

తాజా వార్తలు